రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ తో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం రాష్ట్రంలో మూడు రాజధానిలు  ఏర్పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడం... ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలన్నీ 3 రాజధానిల నిర్ణయంపై ఎంత గగ్గోలు పెట్టినా ఎన్ని విమర్శలు చేసిన... రాజధాని అమరావతి లో ఎన్ని ధర్నాలు చేపట్టిన ప్రభుత్వం మాత్రం  అనుకున్నది సాధించాలి అనే లక్ష్యంతో మూడు రాజధానిల బిల్లును కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. కర్నూలులో న్యాయపరమైన రాజధాని... విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అమరావతిలో చట్టసభల రాజధాని నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. 

 

 

 ఇక దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జగన్ సర్కార్ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయించింది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా... 3 రాజధానిల బిల్లు ఆమోదం విషయంలో ప్రస్తుతం జగన్ సర్కార్ ముందు ఓ సవాల్ ఉందనే చెప్పాలి. అదేంటంటే... 3 రాజధానిల బిల్లును శాసనమండలిలో ఆమోదం పొందేలా చేయడం. అసెంబ్లీలో వైసీపీ కి ఎక్కువ మొత్తంలో మెజారిటీ ఉండటం... అటు టిడిపి నుంచి కూడా కొంతమంది సభ్యులు 3 రాజధానిల నిర్ణయానికి మద్దతు పలకడంతో సులభంగానే 3 రాజధానిల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై శాసనమండలిలో ఏం జరుగుతుంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే శాసన మండలిలో బిల్లును ఆమోదింపజేసేందుకు తగినంత బలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదు అన్న విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రుల ఎన్నికల తర్వాతనే వైసిపి కి శాసనమండలిలో బలం చేకూరే అవకాశం ఉంది. 

 

 

 మరి ఇవన్నీ జరగాలంటే ఇంకో సంవత్సర కాలం పడుతుంది. మరి ఈ ఎన్నికల గురించి పక్కనపెడితే ప్రస్తుతం అయితే శాసనమండలిలో అభివృద్ధికి తగిన బలం లేదు. ఈ నేపథ్యంలో నేడు శాసనమండలిలో ప్రవేశ పెట్టనున్న... మూడు రాజధానుల విభజన,  అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎలా గట్టెక్కించ పోతుంది అన్నది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ మారింది . జగన్ 3 రాజధానిల బిల్లును అసెంబ్లీలో అడ్డుకోలేక పోయినప్పటికీ శాసనమండలిలో మాత్రం తప్పకుండా అడ్డుకుని తీరుతామని అంటూ ఇప్పటికే టీడీపీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక నిన్న అసెంబ్లీలో ఈ బిల్లుపై వాడివేడి వాదనలు జరగ్గా  శాసనమండలిలో అసెంబ్లీకి   మించిన వాదనలు జరుగనున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో బిల్లుకు ఆమోదం తెలుపకూడదు అని టిడిపి... ఎలాగైనా బిల్లుకు ఆమోదముద్ర వేయించాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. మరి శాసనమండలి లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: