తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో న్యాయస్థానం సోమవారం తుది తీర్పును వెలువరించనున్న సంగ‌తి తెలిసిందే. ముగ్గురు బాలికలను అత్యంత క్రూరంగా, పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని  ఇవాళ కోర్టు మరోసారి విచారించనుంది. నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రెండు నెలలుగా ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 200 మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించారు. అయితే ముందు ఈ కేసు ఫిబ్ర‌వ‌రి 6కు వాయిదా వేశారు. ఆ త‌ర్వాత‌ జ‌న‌వ‌రి 17న వాయిదా వేశారు. ఇక‌ ఈ రోజు జ‌డ్జ్‌మెంట్ వ‌స్తుంద‌నుకున్నారు.. అయితే మ‌ళ్లీ ఫిబ్ర‌వ‌రి 6కు వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది.

 

అస‌లు ఈ హాజీపూర్ సైకో శ్రీనివాస్ క‌థేంటి అన్న‌ది చూస్తే.. లిఫ్ట్ మెకానిక్ గా కేరియర్ మొదలు పెట్టిన మర్రి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణాలోని నిజామాబాద్ , ఆదిలాబాద్ ,వేములవాడలోని ప్రాంతాల్లో పనిచేసాడు . అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పనిచేసాడు. జరిగిన మూడు హత్యలు మాత్రమే కాకుండా కర్నూల్ జిల్లాలో స్నేహితులతో తెచ్చుకున్న చెందిన ఓ మహిళను డబ్బుల విషయంలో మాట మాట రావడంతో ఐరన్ రాడ్ తో కొట్టి చంపేసి పెంట్‌ హౌస్‌పై ఉన్న వాడుకలో లేని నీటి ట్యాంకులో పడేసి పరారయ్యాడు. అయితే ఈ కేసు శ్రావణి కేసులో భాగంగా బయటకు వచ్చింది.

 

అంతేకాకుండా పశువులను కాస్తున్న ఓ మహిళ (38)ను రేప్ చెయ్యబోయబోగా, ఆమె కేకలు వెయ్యడంతో ప్రజలు శ్రీనివాస రెడ్డిని చిత‌క‌బాదారు. అనంతరం దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ త‌ర్వాత బాధిత మహిళ కుటుంబ సభ్యులతో రాజీ కుదుర్చుకోవడంతో ఆ కేసు నుంచి బయటపడ్డాడు. కానీ జరిగిన అవమానాన్ని మాత్రం లోపలే ఉంచుకున్నాడు. ఏ రేప్ కేసులో తాను ఇరుక్కున్నాడో, అదే రేప్‌లు చేసి పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగానే కల్పన, మనిషా, శ్రావణిలను చంపేసి  60 అడుగుల బావిలో పడేశాడు. 

 

ఇక శ్రావణి కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి అనే తేలడంతో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు సైతం బావిలో తవ్వకాలు జరపగా.. మృతదేహాల ఆనవాళ్లు లభించాయి. ఇక విచారణ అనంతరం పోలీసులు శ్రీనివాస్‌‌‌రెడ్డిని భువనగిరి కోర్టులో హాజరుపర్చారు. నిందితుడు శ్రీనివాస్‌‌రెడ్డికి న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో శ్రీనివాస్‌ రెడ్డిని కట్టుదిట్టమైన భద్రత నడుమ వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. నిందుతుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష వేయాలని అక్కడి గ్రామా ప్రజలు, మహిళా సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: