ఏపీ నుంచి కియా మోటార్స్ సంస్థ తరలిపోతోందంటూ రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఎల్లో పత్రికల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కథనాలు అడ్డుపెట్టుకుని చంద్రబాబు మొదలుకుని పచ్చ నేతలంతా జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లతో సందడి చేసేశారు. అయితే కియా సంస్థ తరలింపు వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్వయంగా ఆ సంస్థ ఎండీయే మీడియా ముందుకు వచ్చి మరీ వివరణ ఇచ్చారు.

 

 

కాబట్టి అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. అయితే ఈ దుష్ప్రచారం వెనుక ఉన్న అసలైన కథ ఇదీ అంటున్నారు కొందరు వైసీపీ నాయకులు.. చంద్రబాబు బినామీలపై ఐటీ దాడులు జరుగుతుంటే.. దాంట్లో ఎక్కడ బాగోతం బయటపడుతుందోనని ఆయన ఈ విష ప్రచారం చేయించాడంటున్నారు వారు. పరిశ్రమలను వెళ్లిపోవాలని చంద్రబాబే పిలుపు ఇస్తున్నాడని విమర్శిస్తున్నారు. 40 ఏళ్లుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నావ్‌.. ఇకనైనా రాష్ట్రాన్ని వదిలివెళ్లిపోవాలని కోరుతున్నాం.. ఇక్కడి నుంచి పారిపో.. ఇల్లు కట్టుకున్న హైదరాబాద్‌కు వెళ్లిపో.. చంద్రబాబూ.. మీ వైఖరి చూస్తుంటే అసహ్యమేస్తుందంటూ నిప్పులు చెరుగుతున్నారు.

 

 

చంద్రబాబుకు లెఫ్ట్, రైట్‌గా ఉన్న సుజనా చౌదరిపై గతంలో ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. సుజనా చౌదరి బీజేపీలోకి చేరడం వెనుక ఉన్న కారణం ప్రజలకు తెలియదనుకోవడం చంద్రబాబు తెలివితక్కువతనంగా భావిస్తున్నామంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర బాబు. సుజనా చౌదరిని, సీఎం రమేష్‌ లాంటి వారిని బీజేపీలోకి పంపించినా.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ బహిర్గతం అవుతున్నాయని బాబుకు భయం పట్టుకుంది.





అందుకే ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ని, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని ఎల్లోమీడియా ద్వారా చేసే దుష్ప్రచారం చేయిస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఓటమితోనైనా చంద్రబాబుకు సిగ్గు వస్తుందని ఆశపడ్డామని.. ఇప్పటికీ మారలేదని.. ప్రతీది రాజకీయ వ్యభిచార మాటలేనని బాబు పోకడలపై విమర్శలు గుప్పిస్తున్నారు సుధాకరబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: