జగన్ సర్కారు మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. త్వరలో దిశ పేరుతో ఓ చట్టం కూడా రూపొందిస్తోంది. ఇది కేంద్రం ఆమోదం పొందాల్సి ఉంది. ఈలోగా మహిళల రక్షణ కోసం జగన్ సర్కారు దిశ యాప్ కూడా రూపొందించింది.

 

 

అసలు ఈ దిశ యాప్ తో ఉపయోగమేంటి.. అది ఎలా పనిచేస్తుంది.. ఓ సారి చూద్దాం..! ఆపదలో ఉన్న మహిళలకు వెంటనే సాయం చేసే వ్యవస్థ ఏర్పాటుకు దిశ కాల్‌ సెంటర్, దిశ యాప్‌ లను జగన్ సర్కారు ప్రారంభించింది. ఆపద సమయంలో దిశ యాప్‌ అందుబాటులో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అవేలబుల్‌గా ఉంది. దీన్ని ఎవరైనా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.



ఎవరైనా మహిళ ఆపదలో ఉంటే.. యాప్‌లో ఉన్న ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే వెంటనే మొబైల్‌ టీమ్‌లకు సమాచారం వెళ్తుంది. ఏకంగా 5,048 మొబైల్‌ టీమ్‌లకు యాప్‌ లింక్‌ చేయడం జరిగింది. ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే కేవలం 10 సెకన్లలో ఆడియో, వీడియోతో సహా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందుతుంది.



ఆ వెంటనే పోలీసులు వచ్చి కాపాడుతారు. దిశ చట్టం అమలు చేయడానికి, దర్యాప్తు వేగంగా చేయడానికి పోలీస్‌ స్టేషన్లు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు, ప్రత్యేక న్యాయస్థానాలు ఇవన్నీ రాష్ట్రం పరిధిలో ఉన్నాయి. మూడు నెలల్లో వీటిని అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్ చెబుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: