కేంద్రంలో అధికారంలో ఉన్నా.. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో పట్టు కోల్పోతున్నామన్న బాధ, భయం బీజేపీలో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు చూసిన దగ్గర నుంచి బీజేపీ అగ్ర నాయకుల ఆందోళన మరింతగా పెరిగిపోయింది. అందుకే అంతకు ముందు వరకు ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేందుకు ప్రయత్నించిన వీరంతా ఇప్పుడు వారిని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక బిజెపి ప్రభుత్వం తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయం సీఏఏ. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా పార్టీలు బిజెపి వైఖరిని తప్పుపడుతూ నిర్ణయాలు, విమర్శలు చేస్తున్నాయి. ఇక తెలంగాణలో ఎప్పటి నుంచో బలపడాలని బిజెపికి గట్టి షాక్ ఇచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


 టిఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ సభను తాము ప్రేక్షక పాత్ర లో చూస్తూ ఉండిపోతే తెలంగాణలో ఎప్పటికి  కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతుందని భావిస్తున్నారు బీజేపీ పెద్దలు. అందుకే కేసీఆర్ సభకు పోటీగా తెలంగాణలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా వస్తున్నారట. అలాగే ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని బిజెపి ప్రకటించింది. జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న తరువాత మొట్టమొదటి సభ ఇదే కాబోతోంది. 


వచ్చే నెల మొదటి వారంలో అమిత్ షా హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సభను నిర్వహించాలని బిజెపి ప్లాన్ చేసుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభను సక్సెస్ చేయాలని బిజెపి భావిస్తోంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే   ఈ సభను నిర్వహిస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి రేగుతోంది. సీఏఎ బిల్లును పార్లమెంట్ వేదికగా వ్యతిరేకిస్తూ ఆ బిల్లు పత్రాలను చించివేసి మరీ అసదుద్దీన్ నిరసన తెలిపారు. ఇప్పుడు అసదుద్దీన్ కు  గట్టి గుణపాఠం చెప్పే విధంగా ఈ సభను నిర్వహించాలని బిజెపి చూస్తోంది. 


ఈ సభ నిర్వహణ కోసం భారీగా జనసమీకరణ చేయాలని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలకు ఆదేశాలు అందాయి. ఈ  సభలో పవన్ తో ప్రసంగం చేయించాలని బిజెపి చూస్తోంది. పవన్ ప్రసంగం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పై సానుకూలత పెరుగుతుందని బీజీపీ ప్లాన్. అయితే బీజేపీ తీరుపై కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్న పవన్  బిజెపి నిర్వహించే ఈ సభలో పవన్ పాల్గొంటారా లేదా అనేది సందేహంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: