ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించింది. దీని ఎఫెక్ట్ అన్ని దేశాలలో ఎక్కువగానే ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. అయితే. దర్శక నిర్మాత రవిబాబు మాత్రం 

తన సినిమా ప్రమోషన్స్ కి వాడుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ వైరస్ హైదరాబాద్ లో కరోనాకి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కూడా ఈ విషయం తెలిసిందే. 

 

 

అయితే.. వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, భద్రంగా ఉండాలని ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే ముఖానికి మాస్క్‌ లు ధరించాలని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో తిరిగే చాలా మంది మాస్క్‌ లు ధరిస్తున్నారు. 

 

 

ర‌విబాబు దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘క్రష్’ను తన సొంత బ్యానర్ అయిన ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌ పై నిర్మిస్తున్నారు. అయితే.. జనవరి 1న ఈ సినిమా టైటిల్ లుక్‌ ను విడుదల చేశారు. అప్పట్లో టైటిల్ పోస్టర్ బాగా పాపులర్ అయ్యింది. యువతను టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీస్తున్నట్టు రవిబాబు చెప్పారు. కానీ.. అయితే ఆ అమ్మాయి ముఖం కానీ, అబ్బాయిల మొహాలు కానీ ఆ పోస్టర్ చూపించలేదు చిత్ర యూనిట్.

 

 

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో రెండు పోస్టర్లను రవిబాబు వదిలారు. ఒక పోస్టర్‌ లో అమ్మాయి, అబ్బాయి ముద్దు పెట్టుకోవడానికి పెదాలు దగ్గరగా వచ్చినట్టు ఉంది. ఇంకా మరో పోస్టర్ లో జిమ్‌ లో వర్కౌట్ చేస్తోన్న అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. ఈ పోస్టర్‌ లోనూ వాళ్ల ముఖాలు చూపించలేదు. ముఖాలను మాస్క్‌లు వేశారు. అయితే.. దీన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న వైరస్ కు అవేర్ నెస్ కోసం మరియు సినిమా ప్రచారాల కోసం ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రెండు పోస్టర్లపైనా ‘బి సేఫ్’ అని రాశారు. అయితే..ఈ సినిమాను వేసవి కాలంలో విడుదల చేయనున్నారని తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: