కరోనా వైరస్ కేసులు నానాటికీ భారతదేశంలో పెరిగిపోతుండడంతో రాజకీయ నేతలు ప్రభుత్వ అధికారులు అనేకమైన చర్యలను తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేయబడ్డాయి. అయితే తాజాగా కేజ్రీవాల్ సర్కార్ కూడా ఢిల్లీ లోని ప్రతి ఒక్క షాపింగ్ మాల్ ని, ఇతర చిన్నాచితకా దుకాణాలని కూడా మూసివేయాలని ఆదేశాలను జారీ చేసింది. అయితే కిరాణా సరుకుల దుకాణాలు, కూరగాయల షాపులు, మెడికల్ షాప్ లను మినహాయించారు.



ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోషల్ మీడియాలో... 'కరోనా వైరస్ మహమ్మారి వేగవంతంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ పరిస్థితులలో మేము అన్ని దుకాణాలను, షాపింగ్ మాల్స్ ని మూసివేయాలని నిర్ణయించుకున్నాం. మందుల షాపులు, కూరగాయల దుకాణాలు, కిరాణా షాపులు తప్ప మిగతా అన్ని మూసి వేయడం తప్పనిసరి' అని పేర్కొన్నారు.



మరోవైపు ముంబై పూణే లలో కూడా బ్యాంకులు తప్ప మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు మార్చి 31వ వరకు మూసివేయాలంటూ ఆయా ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేశాయి. అలానే 9వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను ఏప్రిల్ 15 తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. తొమ్మిదో తరగతి వరకు పాఠాలు చెప్పే టీచర్లు ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు అని కూడా ఆదేశాలు జారీ చేసింది.




ఇకపోతే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా దేశం మిగతా 1O దేశాలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనుంది. కరోనా వైరస్ ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మన భారతీయ అధికారులు కూడా పాలుపంచుకుంటున్నారు. ప్రస్తుతం చైనా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపు తగ్గిపోయిందని ఆ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. గతంలో ఒక హాస్పటల్ లో వందల మంది కరోనా వైరస్ పేషెంట్లు జాయిన్ అయ్యారని కానీ కొన్ని వారాల్లోనే వారందరికీ చికిత్స అందించి నయం చేసి డిశ్చార్జ్ చేశామని చైనీస్ వైద్యాధికారులు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా చైనా దేశంలో కంటే ఇతర దేశాల్లోనే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదైనా విజయవంతంగా ఎదుర్కొన్న చైనా అధికారుల సలహాలను ఇతర దేశాలు తీసుకోవడం తెలివైన ఆలోచన. 

మరింత సమాచారం తెలుసుకోండి: