క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ఇప్పుడు ఈ పేరు చెబితేనే వెన్నులో వ‌ణుకు పుడుతోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ క‌రోనా మ‌హ‌మ్మారి క్ర‌మంగా ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసి.. ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. భార‌త్‌లోనూ క‌రోనా కేసులు రోజురోజుకు పెరిపోతున్నాయి. అలాగే ఏపీలో సౌతం కరోనా రక్కసి కోరలు చాస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నిజానికి ఏపీలో ఢిల్లీ బాంబు పేలింది. ఈ క్ర‌మంలోనే ఒక్కసారిగా కోవిడ్ 19 కేసుల సంఖ్య డబుల్ అయ్యింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 87కి పెరిగింది. 

 

ఈ ఒక్కరోజే 43 మందికి కరోనా సోకింది. ఇటీవల ఢిల్లీలో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారిలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదైనట్టు గుర్తించిన అధికారులు వారిపై మరింత ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేని రెండు జిల్లాల్లో ఒక్కసారిగా పదుల సంఖ్య కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో వైరస్ భయం నెలకొంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ స‌ర్కార్ క‌రోనా క‌ట్ట‌డికి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డాక్టర్ కే శ్రీనాథ్‌రెడ్డిని పబ్లిక్ హెల్త్ అడ్వైజర్‌గా నియమించింది. 

 

ఆయన గతంలో ఎయిమ్స్ ఢిల్లీలో కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేశారు. వైద్యుడిగా అపార అనుభవం ఉండటంతో రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలపై ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక ఇవాళో రేపో ఆయ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. కాగా, మార్చి 13-15 మధ్య ఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో 2000 మంది పాల్గొనగా.. విదేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే రెండు వేల మంది భారతీయులు ఈ ప్రార్థనల్లో పాల్గొనగా.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో ఏపీలో క‌రోనా కేసులో ఒక్క‌సారిగా జోరందుకున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: