కరోనాను ఎవరూ ఊహించలేదు. ఒక్కసారిగా ఊడిపడిన మహమ్మారి ఇది. భూగోళాన్ని క్రమంగా కమ్మేస్తూ పోతోంది. కానీ కరోనాను ఎదుర్కొనేందుకు దానంత వేగంగా చర్యలు తీసుకోలేకపోయింది ట్రంప్ సర్కార్.! ముఖ్యంగా తగిన వైద్య పరికరాలను సమకూర్చుకోవడంలో కూడా ట్రంప్ సర్కార్ విఫలమైంది. అందుకే అమెరికాలో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

 

కరోనా మనిషి నుంచి మనిషికి సోకుతున్న వ్యాధి. వ్యాధిగ్రస్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అతని నుంచి వచ్చే తుంపర్ల ద్వారా వ్యాధి మరొకరికి సోకుతుంది. అందుకో సామాజిక దూరం పాటించాలని కోరుతున్నాయి ప్రభుత్వాలు. కానీ ఈ విషయంలో ట్రంప్ సర్కార్ విఫలమైంది కాబట్టి వ్యాధి బాగా విస్తరించింది. వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోయింది. 

 

అసుపత్రుల్లో చేరిన రోగులకు తగిన మాస్కులు, గ్లౌజులు, గౌన్లు అవసరం. తీవ్రంగా జబ్బుపడిన వారికి వెంటిలేటర్లు కూడా అవసరమవుతాయి. రోగులకు మాత్రమే కాదు.. చికిత్స అందించే వైద్యులు, ఇతర సిబ్బందికి సైతం మాస్కులు, గ్లౌజులు, గౌన్లు అవసరమవుతాయి. కానీ అమెరికాలో ఇవి సరిపడా అందుబాటులో లేవు. దీంతో అటు రోగులు, ఇటు వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..


 
అమెరికాలో ఆసుపత్రులు సకల సౌకర్యాలతో ఉంటాయి. కానీ ఇప్పుడు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన సదుపాయాలు లేక సతమతమవుతున్నాయి. వైద్యపరికరాలు సరిపడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఉన్నవాటినే సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటిలేటర్ల తయారీకోసం ప్రభుత్వం జనరల్‌ మోటార్స్‌కు ఆగమేఘాల మేఘాల మీద ఆర్డర్ ఇచ్చింది. అయితే అవి ఎప్పటికి వస్తాయో తెలీదు.

 

వెంటిలేటర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఫెడరల్ ప్రభుత్వం వీటిని అందించడంలో విఫలమవుతోంది. దీంతో పలు రాష్ట్రాలు స్వచ్ఛందంగా సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పరికరాలకోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడడంతో ధరలు ఒక్కసారిగా పెంచేశారు ఉత్పత్తిదారులు. ఇప్పటికిప్పుడు ఉత్పత్తి చేయడం కూడా అంత సులువు కాదు. ప్రస్తుత డిమాండ్‌కు సరిపడా పరికరాలు రావాలంటే కొంత సమయం పడుతుంది. ఈలోపు పుణ్యకాలం గడిచిపోవచ్చు.

 

వ్యాధి ముంచుకొస్తోందని అంచనా వేయడంలో కానీ, అందుకు తగ్గట్లు సన్నద్ధం కావడంలో కానీ ట్రంప్ సర్కార్‌ పూర్తిగా విఫలమవడం వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కరోనా వైరస్‌ను తక్కువ అంచనా వేసి వారాలు గడిపేయడం వల్లే ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోందనేది వారి మాట. అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయగలిగేంత సమయం, సత్తా ఉన్నా కూడా వినియోగించుకోలకపోయారని వారు విమర్శిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: