త‌ల్లిదండ్రులుగా మార‌డం అన్న‌ది ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో ఒక మ‌ధురానుభూతి. పిల్లలు పుట్టాకే మ‌నిషి జీవితం ఒక అర్ధ‌వంత‌మైన మ‌లుపు తిరుగుతుంది. మ‌నిషిగా జీవితానికి ఒక సార్ధ‌క‌త ఏర్ప‌డుతుంది. అయితే పిల్ల‌ల పెంప‌కం అనేది అంత సులువైన‌ విష‌యం కాదు. పిల్ల‌ల వ‌య‌స్సు ఎంత ఉన్న కానీ త‌ల్లిదండ్రుల బాధ్యత అన్న‌ది తీరిపోయేది కాదు. పిల్ల‌లను ఎలా ప్రేమించాలి? వాళ్ల‌కు భ‌ద్ర‌మైన వాతావ‌ర‌ణం ఎలా క‌ల్పించాలి? ఏది మంచి..ఏది చెడు అన్న‌ది పిల్లలకు చిన్నపటి నుండే చెప్పాలి . 

 

 

ఒక పిల్ల‌వాడు స్వ‌తంత్రంగా, విలువ‌ల‌తో, పెద్ద‌ల ప‌ట్ల గౌర‌వంతో, పూర్తి ఆత్మ‌విశ్వాసంతో ఎంత బాగా ఎదిగాడ‌న్న‌ది త‌ల్లిదండ్రుల పెంప‌కంపై ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అంద‌రూ త‌మ పిల్ల‌ల‌కు మంచి పెంప‌కాన్ని అందించి గుడ్ పేరెంట్స్ గా మారొచ్చు. పిల్ల‌ల‌కు అంద‌మైన భవిష్య‌త్ ను కానుక‌గా ఇవ్వొచ్చు.ముందుకంటే ఇప్పుడు లింగభేదం విషయంలో అందరి ప్రవర్తనా మారింది. అయినప్పటికీ కొంతమందిలో  లింగభేదం  పోలేదు. ఇది ఎప్పటికీ మంచిది కాదు. ఆడ, మగ ఇద్దరూ సమానమే అని తెలుసుకుని ఆ విధంగానే పిల్లల్నీ పెంచండి. ఇదే వారు కూడా భవిష్యత్‌లోనూ అమలు చేస్తారు.పిల్లల్ని గారాబం చేయాలి. అంతేకానీ, వారిని సోమరిపోతులుగా మార్చకూడదు. అందుకే చిన్నతనం నుంచే కొన్ని పనులు వారే స్వతహాగా చేసుకునేలా అలవాటు చేయాలి. పిల్లలలో ఉన్నా టాలెంట్ ని గుర్చించి ఎంకరేజ్ చెయ్యాలి. 

 

 

ప్రతీ చిన్నారిలోనూ ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. పేరెంట్స్‌ దాన్ని గమనించి ప్రోత్సహించాలి. ఒక వేళ అలాంటివేం పిల్లల్లో మనం గుర్తించకపోతే.. వారికి ఏం ఇష్టమో.. తెలుసుకుని ఆ రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి. ఇదే వారి భవిష్యత్‌కి పునాది అవుతుంది.అంతేగాని మన  ఇష్టాలని వాళ్లపై రుద్దకూడదు. పిల్లలకి చక్కని విద్య అందించడమనే విషయంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉందో.. తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉంటుంది. అదే విషయం పేరెంట్స్‌ గుర్తుపెట్టుకుని  పిల్లలు చదివేందుకు చక్కని వాతావరణం కలిగించాలి.

 

 

పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్‌ని చదివేందుకు కష్టపడతారు. ఆ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శిక్షణ ఇవ్వాలి.

పిల్లలకు స్వేచ్ఛ, క్రమశిక్షణ సమపాళ్ళలో ఉండాలి. వారికి చదువు ఎంత అవసరమో, ఆటపాటలు కూడా అంతే అవసరం.. ఇది వారి శారీరక, మానసిక వృద్ధికి దోహదం చేస్తాయి. 

 

పిల్లలను విమర్శించడం కంటే వారు ఏ తప్పులు చేస్తున్నారో ప్రేమగా చెప్పి చూడాలి. వారిని మార్చే ప్రయత్నం ప్రేమతోనే మొదలవ్వాలి. ఆత్మవిశ్వాసం, సహనం, అభినందలతో కూడిన పెంపకం ఎప్పుడూ కూడా మంచి మార్గంలో ఉంటుంది ..

ఎదుటివారిని గౌరవిస్తూ నీతిగా బతకడం నేర్పుతుంది.  తల్లిదండ్రులు వీలయినంత ఎక్కువ సేపు పిల్లలతో గడపడానికి చుడండి.  ప్రతి ఒక్క తల్లిదండ్రులు ముఖ్యంగా ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ పెంపక విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకోవాలి. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే వారు పిల్లల భవిష్యత్‌ కూడా బాగుంటుంది.  చిన్నారుల జీవితం కూడా బాగుంటుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: