శత్రువు శత్రువు మిత్రుడు అని ఓసామెత ఉంటుంది. రాజకీయాల్లోనూ ఇది వర్తిస్తుందా.. అంటే అవునుంటున్నారు ఏపీ నాయకులు.. ఎందుకంటే.. ఏపీలో గతంలో కత్తులు దూసుకున్న మూడు పార్టీలు ఇప్పుడు ఒకే రాగం ఆలపిస్తున్నాయి. అధికారంలోకి ఉన్న జగన్ ను ఎదుర్కొనేందుకు ఆ ముగ్గూరూ తాము ముగ్గురం కాదు.. ఒక్కటే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.

 

 

ఇంతకీ ఆ ముగ్గురూ ఎవరంటారా.. వారే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ. కన్నా కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబుపై ఏ రేంజ్‌లో ఎగిరిపడే వారో.. కానీ ఆయన పార్టీ మారి బీజేపీలోకి వచ్చాక.. చంద్రబాబు అధికారం కోల్పోయాక వీరిద్దరికీ జగన్ ఉమ్మడి శత్రువు అయ్యాడు. ఇక వీరికి మరో నాయకుడు పవన్ కల్యాణ్ జత కుదిరాడు. ఇప్పుడు ఈ ముగ్గురూ వేరు వేరు పార్టీలైనా ఒక్కరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.

 

 

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయని విమర్శించారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోటి 33 లక్షల మందికి రూ.1000 అందిస్తే.. దాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.

 

 

తాజాగా జగన్ సర్కారు పేదలకు అందిస్తున్న వెయ్యి రూపాయల సాయం కూడా రాజకీయమవుతోంది. 1000 ఇచ్చి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలన్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ ఓ వీడియో విడుదల చేశారు. దీనిపై స్పందించిన అంబటి.. కన్నాకు చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఎక్కడిదో బయటపెట్టాలన్నారు. రూ.1000 పంపిణీలో అవినీతి జరిగినట్లు చూపిస్తే ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందన్నారు అంబటి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: