దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ విస్తరించి పోతుంది.  ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి.  దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వైరస్‌ను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ విధించింది. అయితే గత మార్చి 29 వరకు ఈ వైరస్ కంట్రోల్ అవుతుందనుకున్న నేపథ్యంలో మర్కజ్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిఘీ జమాతే సమావేశానికి హాజరైన పలువురు వీదేశీయుల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు తేలాయి.

 

తాజాగా  దేశ రాజధాని దిల్లీలో తబ్లీగీ జమాత్‌ ఇటీవల నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొని కూడా ఇప్పటివరకూ అధికారులకు సమాచారమివ్వకుండా తప్పించుకు తిరుగుతున్నవారిపై హత్యాయత్నం అభియోగాలు మోపాలని కొన్నిచోట్ల అధికారవర్గాలు యోచిస్తున్నాయి. అంతేకాదు ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే ప్రయ్నాలు మొదలు పెట్టారు.  

 

జాతీయ భద్రత చట్టాన్ని(ఎన్‌ఎస్‌యేను) వారిపై ప్రయోగించే అంశాన్నీ పరిశీలిస్తున్నాయి. 'తబ్లీగీ' కార్యక్రమంలో కనీసం 9 వేలమంది పాల్గొన్నట్లు అంచనా. వారిలో ఎక్కువమంది తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు.  అలాంటి వారితో సన్నిహితంగా మెలిగినవారంతా పరీక్షలు చేయించుకోవాలని దేశవ్యాప్తంగా అధికారవర్గాలు సూచించినా, చాలామంది ఇప్పటికీ బయటకు రావట్లేదు. కాగా, ఢిల్లీ నిజాముద్దీన్ కార్యక్రమానికి వెళ్లి వచ్చినప్పటి నుంచి దేశంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మద పెద్దలతో ముఖ్యమంత్రులు ఫోన్లో మాట్లాడుతున్న విషయం తెలిసిందే. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: