గత నెల నుంచి తెలుగు రాష్ట్రాలకు కరోనా వైరస్ ప్రబలిపోతూ వస్తుంది.  దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న 170 జిల్లాలను 'కొవిడ్‌-19 హాట్‌స్పాట్‌'లుగా కేంద్రం ప్రకటించింది. వీటిని 'రెడ్ జోన్‌'లుగా వర్గీకరించింది. వైరస్ మరింత విస్తరించకుండా ఈ జిల్లాల్లో అతి కఠినమైన లాక్‌డౌన్ చర్యలు తీసుకుంటారు. ఏపీలో 11 జిల్లాలను, తెలంగాణలో 8 జిల్లాలను హాట్‌స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది.  కరోనా రెడ్ జోన్లలో డోర్ టూ డోర్ సర్వే చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్‌పై కూడా రాష్ట్రాలకు కేంద్రం స్పష్టత ఇచ్చింది.

 

అత్యధికంగా తమిళనాడులో ఎక్కువ రెడ్ జోన్లు ఉన్నాయి. తమిళనాడులోని 37 జిల్లాల్లో 22 జిల్లాలను రెడ్ జోన్లుగా గుర్తించారు. రెండవ స్థానంలో 14 జిల్లాలతో మహారాష్ట్ర ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 13, రాజస్థాన్‌లో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11, ఢిల్లీలో 10 రెడ్ జోన్లను గుర్తించారు. 

 

హైదరాబాద్ లో రెడ్ జోన్లు :
హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్‌, వరంగల్ అర్బన్‌, జోగులాంబ గద్వాల, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కరీంనగర్‌, నిర్మల్‌, నల్గొండ

తెలంగాణలో ఆరెంజ్ జోన్లు :

సూర్యాపేట, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, భద్రాద్రి, జగిత్యాల, జనగాం, జయశంకర్‌, కొమరం భీం ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, సిరిసిల్ల, సిద్దిపేట

 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రెడ్ జోన్ జిల్లాలు :
కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కడప, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, చిత్తూరు, విశాఖపట్టణం, అనంతపురం 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: