కరోనా ఇదో కొత్త రోగం. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు అందరికీ తెలియదు. తెలిసిన కొన్ని అంశాల ఆధారంగానే కట్టడి చేయాలి. ఈ విషయంలో ఇప్పటికే కరోనాకు వైద్యం చేసిన, చేస్తున్న వైద్యుల అనుభవాలు ఎంతో అమూల్యం. సరిగ్గా ఇదే పాయింట్ తో జగన్ సర్కారు ఏపీలో వైద్య చికిత్సలు మెరుగపరుచుకుంటోంది.  దేశవిదేశాల్లో చికిత్స విధానాలను తెలుసుకునేందుకు అమెరికాలోని వైద్యులు, ఏపీ వైద్యులతో కూడిన ఓ వాట్సప్ గ్రూప్ ను కూడా ఏర్పాటు చేసింది. 

 

 

ఈ గ్రూపులో నిరంతరం సమాచార మార్పిడి ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. అదే సమయంలో ఏపీలో కరోనా టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గరిష్ఠంగా  రోజుకు 17 వేల నిర్ధారణా పరీక్షలు చేయాలని భావిస్తోంది.  క్షయవ్యాధి నిర్ధారణ కోసం వినియోగించే ట్రూనాట్ యంత్రాలనూ  కరోనా పరీక్షలకు వినియోగించాలని నిర్ణయించింది.  కేసుల సంఖ్య పెరిగితే క్వారంటైన్  కేంద్రాలను  కరోనా కేర్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

 

ప్రస్తుతం రోజూ వెయ్యి వరకూ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. వాస్తవానికి  లాక్ డౌన్ తర్వాత ఎక్కువ పరీక్షలు నిర్వహిచాల్సి ఉందని.. తక్కువ పరీక్షలు నిర్వహించి వైరస్ వ్యాప్తి లేదని అనుకోవటం మనల్ని మనం మభ్యపెట్టుకోవటమేనని  ఆ శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో 503 కేసులు 94 మండలాల పరిధిలోనే విస్తరించి ఉన్నాయని చెబుతున్నారు. 

 

 

ప్రస్తుతం రాష్ట్రంలో 1500 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని మరిన్ని కొనుగోలు చేస్తున్నామని ఆయన చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగితే క్వారంటైన్ కేంద్రాలను కరోనా కేర్ సెంటర్లుగా మార్పు చేస్తామని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ సర్కారు టెక్నాలజీని బాగా వాడేస్తోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: