ప్రస్తుతం ప్రధాన నగరాలలో సైబర్ మోసగాళ్లు అమాయకమైన ప్రజలకు రకరకాల ఆఫర్ లు అంటూ వెంటపడుతూ మోసాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో సైబర్ మోసగాళ్లు వీరంగం సృష్టిస్తున్నారు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని సైబర్ నేరస్తులు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో వారి బ్యాంకు అధికారులగా ఫోన్ చేసి ఓటిపి తదితర వివరాలు తెలుసుకొని వారి నగదును దోచేస్తున్నారు. ముందుగా క్విక్ సపోర్ట్ యాప్ అని బాధితులతో ఆప్ ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫోన్ ఆపరేటింగ్ అంతా కూడా సైబర్ మోసగాళ్లు చేతిలోకి వెళ్లిపోతుంది.

 


ఇక అంతే బాధితులు బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకొని వారి బ్యాంక్ అకౌంట్ లో నుంచి నేరగాళ్లు స్వయంగా నగదు ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని భావిస్తున్న తరుణంలో సైబర్ క్రైమ్ అనుకోని విధంగా పెరుగుతుందని పోలీసులు తెలియజేస్తున్నారు. సైబర్ నేరస్తులు ప్రజలను ఆకట్టుకోవడానికి వివిధ రకాల ఆఫర్లు ప్రకటించడంతో ప్రజలు మోసపోతు లబోదిబోమంటున్నారు. ఈ తరుణంలోనే తాజాగా హైదరాబాదులో ఏకంగా 69 మంది బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు అంటే నమ్మండి ప్రస్థితి ఎలా ఉంటుందో. అలాగే ఫలానా యాప్ లు చాలా ప్రమాదకరం.. వాటిని డౌన్ లోడ్ చేసుకోవద్దు అని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇంతే కాకుండా పేస్ బుక్ అకౌంట్లో మార్కెట్ ప్లేస్ లోనూ టార్గెట్ చేసి కొన్ని వేలల్లో, లక్షల్లో నగదును మోసపోతున్నారు కూడా. 

 


కొందరు సైబర్ మోసగాళ్లు అతి తక్కువ ధరకే ఐఫోన్ ఇస్తామంటూ, బైక్ హోమ్ డెలివరీ లు అందజేస్తామని అంటూ, ఏసి రిపేర్ కోసం ఫోన్ చేస్తే మేము స్వయంగా వస్తాము అంటూ ప్రజలను మాయ మాటలతో, ఇలా రోజు అనేక విధాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ కేటుగాల్లు. కాబట్టి కాస్త ఇటువంటి వాటికీ కాస్త దూరంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: