రోజులో ఒక సారైనా వినపడే మాట అమ్మాయిల పై అత్యాచారం.. మహిళలను కాపాడటానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ వస్తున్న కూడా కామాంధుల కామ దాహం తీరడం లేదు.. అది ఇప్పటి కాలంలో కామన్ అయిపోయింది.. చిన్నా పెద్దా వావి వరుసలు కూడా మరచి ఇష్టమొచ్చినట్లు కామదహం తీర్చుకోవడానికి మగ మృగాలు రెచ్చిపోతున్నారు.. అందుకే ఇప్పుడు చాలా మంది అత్యాచారాలకు గురవుతున్నారు.. 

 

 


అసలు విషయానికొస్తే ఇక్కడ ఒక సంఘటన అందరినీ ఆలోచింప జేస్తుంది..వివరాల్లోకి వెళితే..అత్యాచారానికి గురైన ఓ మైనర్‌ బాలిక గర్భం దాల్చిన ఘటనలో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాధితురాలి కడుపులో పెరుగుతున్న 24 వారాల పిండాన్ని తొలగించుకోవడానికి న్యాయస్థానం అనుమతించింది. వైద్య నిపుణుల సలహా తీసుకున్న అనంతరం ఈ తీర్పు వెలువరించింది. మే 21న శస్త్రచికిత్స ద్వారా బాధితురాలి గర్భాన్ని విచ్ఛిత్తి చేయడానికి వైద్యులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 23 వారాల గర్భిణిగా ఉన్న 17 ఏళ్ల ఆ బాలిక.. మే 21 నాటికి 24 వారాల గర్భం దాల్చనుంది.

 

 

అత్యాచారానికి గురవడం ద్వారా గర్భం దాల్చిన తన కుమార్తె ప్రెగ్నెన్సీ తొలగించుకోవడానికి తక్షణమే అనుమతి ఇవ్వాలని కోరుతూ బాధితురాలి తల్లి మే 13న బాంబే హైకోర్టును ఆశ్రయించింది. గతేడాది జరిగిన అత్యాచారం కారణంగా తన బిడ్డ గర్భం దాల్చిందని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం తన కుమార్తె తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తోందని.. అందువల్ల గర్భం తొలగించడానికి వెంటనే అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా తన కుమార్తె చదువుపై శ్రద్ధ పెట్టడానికి తోడ్పడుతుందని అభ్యర్థించారు.

 

 

 

గర్భం వల్ల చదువుకోలేదు అని విజ్ఞప్తి చేశారు.. ఇకపోతే డాక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం హైకోర్టు అనుమతి ఇవ్వడంతో గర్భాన్ని తొలగించారు..కుమార్తెను ఓ యువకుడు లైంగికంగా వేధించాడని.. గతేడాది ఆమెను కిడ్నాప్ చేసి మరో రాష్ట్రానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట బాధితురాలి కడుపునొప్పితో బాధ పడుతుండగా ఆస్పత్రికి తీసుకెళ్తే.. పరిశీలించిన వైద్యులు బాలిక 22 వారాల గర్భం దాల్చినట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: