ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి ఎలా క‌మ్మేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ప్ర‌తి ఒక్క‌రు మాస్క్‌లు వేసుకుంటే క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చ‌న్న ఆశ‌ల‌తో ఉన్నారు. అయితే వాస్త‌వంగా చూస్తే పూర్తిగా మాస్క్‌ను న‌మ్ముకుని నిర్ల‌క్ష్యంగా ఉంటే ప్ర‌మాదం త‌ప్ప‌ద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. మాస్కులు అనేవి కొద్దిపాటి సమయానికి వాడకం కోసం అంతే తప్ప 24 గంటలు లేదా 12 గంటలు నిరంతరంగా ధరించేందుకు కాదు. కరోనా ఏమి గాలిలో పిట్టలా ఎగురుకుంటా వచ్చి మన ముక్కులో దూరదు క‌దా ?  అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

 

అయితే రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఆ ఉన్నంత సేపు మాస్క్ ధరిస్తే చాలు అట‌. అయితే మాస్క్ ఎక్కువ సేపు ధ‌రించ‌డం వ‌ల్ల కొన్ని ప్ర‌మాదాలు కూడా ఉన్నాయంటున్నారు. కొందరైతే ముక్కుకు కట్టుకొని బైక్ మీరు వందల కిలోమీటర్లు పోతున్నారు... ఇంకొందరు ఇళ్లల్లో కూడామాస్క్‌లు ధ‌రిస్తున్నా... మాస్క్ ఎక్కువ  వాడితే ఆక్సిజన్ తక్కువ పీలుస్తాం.. అలాగే మెదడుకి ఆక్సిజన్ తక్కువై  శరీరం బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది... అలాగే మాస్కులేసి పొద్దున్నే జాగింగ్ చేస్తున్నారు.. ఇలా ఎక్కువ సేపు మాస్క్ తొడుక్కుంటే మొద‌డుకు ఆక్సిజ‌న్ అంద‌ద‌నే అంటున్నారు.

 

అసలు కరోనా సోకిన రోగి మన ముందు ఉన్నంత మాత్రాన అతడి నుండి మనకేమి క‌రోనా వచ్చేయదు. స‌ద‌రు రోగి తుమ్మితేనో.. దగ్గితేనో ఆ సమయంలో మనం అక్కడ ఉండి పీలుస్తేనే వస్తుంది తప్ప కిలోమీటర్లు కిలోమీటర్లు ఈ వైర‌స్‌ ప్రయాణించదు. జాగింగ్ చేస్తూ మాస్క్ ధరించడం కొంచం ప్రమాదకరం.. బయట ప్రదేశం అయితే ఫరవాలేదు. జిమ్ముల్లో ఉండే గాలి చాలా తక్కువ.. అలాంటిది అక్కడ కూడా మాస్క్‌లు ధరిస్తే ఆక్సిజన్ అందక  ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. చైనా జిమ్ముల్లో ఇలానే జరిగి ఇద్దరు చ‌నిపోయారు. ఏదేమైనా ఒంట‌రిగా వెళుతున్న‌ప్పుడు.. కార్ల‌లో ఒక‌రే వెళుతున్న‌ప్పుడు మాస్క్‌లు అక్క‌ర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: