ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న అయోధ్యలోని రామమందిర నిర్మాణం కేసును గత సంవత్సరం సుప్రీమ్ కోర్ట్ పరిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం అయోధ్యలో కొన్ని పురాతన దేవత విగ్రహాలు బయటపడ్డాయి. ఆ గుడికి సంబంధించిన రామజన్మభూమిలో స్థలాన్ని చదును చేస్తున్న క్రమంలో విరిగిన దేవతా విగ్రహాలతో పాటు ఐదు అడుగులు ఎత్తు ఉన్న శివలింగం, ఏడు నల్లరాతి స్తంభాలు, 6 ఎర్ర రాతి స్తంభాలు, అలాగే ఒక కలశం అన్ని ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

 

IHG


అయితే ఈ విషయంపై రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ సంపత్ రాజ్ విషయాలను తెలుపుతూ... ఈ రామజన్మభూమిలో గత పది రోజులుగా భూమిని చదును చేస్తున్నామని ఆయన తెలిపారు. దీనితో అక్కడ కొన్ని శిథిలాలను వారు కనుగొన్నారు అని చెబుతున్నారు. ఇక్కడ అనేక రాతన అవశేషాలను కనుగొన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

 

IHG


ఇక అంతే కాకుండా ఈ తవ్వకాలలో కొన్ని పిల్లర్స్ తో పాటు శిల్పాలు కూడా బయటికి వచ్చాయని తెలిపారు. అయితే ఈ విషయంపై విశ్వహిందూ పరిషత్ స్పందించింది. ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ నేత వినోద్ బన్సల్ మీడియాతో మాట్లాడుతూ... మే 11న రామాలయం పనులు మొదలైనప్పటి నుంచి తవ్వకాల్లో పూర్ణకుంభం లాంటి ఎన్నో పురాతన అవశేషాలు దొరికాయని ఆయన తెలిపారు. అయితే గత 50 సంవత్సరాల నుంచి వివాదాల్లో కొనసాగుతున్న అయోధ్య సమస్యను సుప్రీం కోర్ట్ గత సంవత్సరం పరిష్కారాన్ని తెలిపింది. ఇందులో భాగంగానే రామజన్మభూమి స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ, అలాగే మరోవైపు మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డ్ కు వేరే ప్రదేశంలో ఐదు ఎకరాలు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: