ఏపీలో ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. అంత‌లోనే క‌రోనా త‌గ్గుతుంద‌ని అనుకున్నా మ‌ళ్లీ వెంట‌నే ఏపీలో కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి. క‌రోనా వేళ ఎంతో మంది పేద‌, సామాన్య ప్ర‌జ‌లు చివ‌ర‌కు తిండి లేక ప‌డిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక క‌రోనా క‌రాళం వేళ ఏపీలో ఎంతో మంది ప్ర‌జా ప్ర‌తినిధులు, ఎంపీలు... ఎమ్మెల్యేలు త‌మ సొంత నిధుల‌తో ఎన్నెన్నో సాయాలు చేశారు. ఏపీలో అన్ని జిల్లాల్లో ఉన్న ప్ర‌జా ప్ర‌తినిధులు అంద‌రూ రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా తాము ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ‌లు అన్నీ ఇన్నీ కావు. 

 

విశాఖ న‌గ‌రంలో వైసీపీ ఓడిపోయినా అక్క‌డ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న క‌మ్మ‌లి క‌న్న‌ప‌రాజు.. ద్రోణంరాజు శ్రీనివాస్‌, అక్ర‌మాని విజ‌య‌నిర్మ‌ల‌, మ‌ళ్ల విజ‌య్ ప్ర‌సాద్ ప్ర‌తి రోజు నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల‌కు ఏదో ఒక‌టి పంచుతూనే ఉన్నారు. ఇక ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లాలో సైతం ప‌లాస ఎమ్మెల్యే సీదిరి అప్ప‌ల‌రాజు, మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి త‌దిత‌రులు ప్ర‌జ‌ల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణీ చేశారు. వీరు ఏదో ఒక‌టి రెండు రోజులు కాకుండా ప్ర‌జ‌ల‌కు కంటిన్యూగా ఇవి స‌ర‌ఫ‌రా చేయ‌డం విశేషం. 

 

ఇక గుంటూరు జిల్లాలో ప‌లువురు ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఏకంగా నాలుగైదు సార్లు నియోక‌వ‌ర్గం అంతా నిత్యావ‌స‌రాలు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లాలో మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దేవినేని అవినాష్‌, మంత్రి కొడాలి నానితో పాటు మ‌రో మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ త‌దిత‌రులు నిత్యావ‌స‌రాలు పంపిణీ ఎక్కువుగా చేశారు. మిగిలిన నేత‌లు కూడా ఇవి పంపిణీ చేసినా వీరు ప్ర‌తి నిత్యం నియోజ‌క‌వ‌ర్గంలో ఏదో ఒక చోట నిత్యావ‌స‌రాలు పంపిణీ చేయ‌డంతో పాటు రెండు .. మూడు రౌండ్లు పంపిణీ చేశారు. 

 

ఇక లాక్‌డౌన్‌ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణలో ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి ఏకంగా 30 వేల కుటుంబాలకు ఆయన తన సొంత నిధులతో సాయం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌ట్ట‌ణంలో మూడు సార్లు ఆయ‌న నిత్యావ‌స‌రాలు పంపిణీ చేశారు. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్‌లో పార్టీ నుంచి ఎవ‌రెవ‌రు ప్ర‌జ‌ల‌కు ఎలా సాయం చేశార‌న్న దానిపై ప్ర‌త్యేక నివేదిక‌లు తెప్పించుకున్న జ‌గ‌న్ కొంద‌రి విష‌యంలో ప్ర‌త్యేకంగా మెచ్చుకుని... ఇలాంటోళ్లు పార్టీకి.. ప్ర‌జ‌ల‌కు ఉండాల‌ని అన్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: