దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రింట్ మీడియా పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. పత్రికలు చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. వెబ్ మీడియాపై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో పత్రికల సర్క్యులేషన్ క్రమంగా పడిపోతుంది. దేశంలో అన్ని పత్రికల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇందుకు ఏ రాష్ట్రం మినహాయింపు కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు ప్రధాన పత్రికల సర్క్యులేషన్ క్రమంగా పడిపోతుంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ ప్రధాన పత్రికలు. ఈ పత్రికల్లో నమస్తే తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి పరిమితం. రెండు రాష్ట్రాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఈ మూడు పత్రికల సర్క్యులేషన్ భారీగా తగ్గింది. అయితే ఈ తగ్గుదల ప్రభావం సాక్షిపై తక్కువగానే ఉండగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై ఎక్కువగా ఉంది. 
 
ఈ రెండు పత్రికల సర్క్యులేషన్ భారీగా తగ్గింది. మరోవైపు సోషల్ మీడియా ప్రభావం పెరగడం కూడా ఈ పత్రికల సర్క్యులేషన్ తగ్గడానికి కారణమవుతోంది. ఈ రెండు పత్రికల సర్క్యులేషన్ తగ్గడానికి కారణాలేమిటనే ప్రశ్నకు వింత సమాధానాలు వినిపిస్తున్నాయి. నిజానికి క్వాలిటీలో మూడు పత్రికలు ఒకే స్థాయిలో ఉన్నా సాక్షి తక్కువ రేటుకే లభ్యమవుతోంది. 
 
అందువల్ల సామాన్యులు కొంత భారం తగ్గించుకోవడానికి ఈ పత్రికకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం కూడా సాక్షికి ప్లస్ అయింది. తాజాగా ఏబీసీ సర్వేలో సాక్షి కొన్ని ప్రాంతాలలో కాపీలు పెంచుకుంటే ఈనాడుకు 40,000కు పైగా ఆంధ్రజ్యోతికి 50,000కు పైగా పత్రికల సర్క్యులేషన్ తగ్గింది. మరి లాక్ డౌన్ తర్వాతైనా ఈ పత్రికలు పుంజుకుంటాయో లేదో చూడాలి.                

మరింత సమాచారం తెలుసుకోండి: