తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు 71 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 66 కేసులు నమోదు కాగా ఈరోజు 71 కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 38 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. 
 
రంగారెడ్డి జిల్లాలో ఏడు కరోనా కేసులు, మేడ్చల్ జిల్లాలో ఆరు కరోనా కేసులు, నారాయణ పేట్, నల్గొండ, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైంది. ఈరోజు నమోదైన కేసుల్లో 12 మంది వలస కార్మికులు కాగా నలుగురు విదేశీయులని తెలుస్తోంది. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1991కు చేరగా రాష్ట్రంలో మృతుల సంఖ్య 57కు చేరింది. రాష్ట్రంలో ఈరోజు 120 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 650 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1284 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న హైదరాబాద్ నగరవాసులు ప్రభుత్వం తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రతిరోజూ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నా నగరంలో ఎక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయో తమకు తెలియడం లేదని వారు చెబుతున్నారు. 
 
హైదరాబాద్ నగరంలో ఏరియాల వారిగా పూర్తి వివరాలను ప్రకటించాలని... మేజర్ ఏరియాల కరోనా కేసుల వివరాలు తెలుస్తున్నా మిగతా ఏరియాల్లో ఎక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయో అర్థం కావడం లేదని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఏయే ఏరియాల్లో కేసులు నమోదయ్యాయో ప్రకటిస్తే తాము జాగ్రత్త పడతామని లేదంటే కరోనా భారీన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. నగరవాసుల ప్రశ్నల గురించి కేసీఆర్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: