ప్రస్తుతం భారీ ఎత్తున సభాలు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇది సరైన సమయం కాకపోయినా, మహానాడును ఏదోవిధంగా జరిపి తీరాలని, కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకురావాలనే సంకల్పంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధునిక టెక్నాలజీకి పదును పెట్టి మరి, డిజిటల్ మహానాడు నిర్వహించారు. జూమ్ యాప్ ద్వారా వేలాది మంది కార్యకర్తలు మహానాడును వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు. ఒక వైపు కరోనా కంగారులో పార్టీ శ్రేణులు, ప్రజలు ఉన్నా, మహానాడు మాత్రం జరిగి తీరాల్సిందే అన్న పట్టుదల తో చంద్రబాబు రెండు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆగమేఘాల మీద చంద్రబాబు హైదరాబాద్ కు తన కుమారుడు తో సహా వెళ్లిపోయారు. ఇంత వరకు బనగానే ఉన్నా, అసలు మహానాడు నిర్వహించడం వల్ల తెలుగుదేశం పార్టీ సాధించింది ఏమిటి అనే చర్చ ఇప్పుడు సొంత పార్టీ నాయకుల్లో మొదలైంది.

IHG


 పార్టీకి సంబంధించిన అన్ని విషయాల పైన మహానాడు సందర్భంగా మాట్లాడాల్సి ఉన్నా, కేవలం అధికార పార్టీని విమర్శించడానికి, జగన్ తప్పులను ఎత్తి చూపించడాని కే ఎక్కువ సమయం కేటా యించారని తెలుగు తమ్ముళ్ళ అసలు బాధంతా. అసలు 151 సీట్లతో వైసిపిని గెలిపించి ఏపీ ప్రజలు చాలా పెద్ద తప్పు చేశారు అన్నదే మహానాడు వేదికపై ఉన్న పెద్దలు చేసిన ప్రసంగాల్లో ముఖ్యాంశాలు. రెండు రోజుల మహానాడు కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపించడానికి కేటాయించారు తప్ప మిగతా విషయాలు చర్చించలేదు అన్నది టీడీపీ నాయకుల అభిప్రాయం.

 

IHG's first-ever virtual 'Mahanadu'


 అసలు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడానికి కారణాలు ఏంటి ?  తప్పు ఎక్కడ జరిగింది ? ఆ లోపాలను ఏవిధంగా సరిదిద్దుకోవాలి ? మళ్లీ పార్టీ పునర్వైభవం సాధించాలంటే ఏం చేయాలి ? నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం ఎలా ?  తెలుగుదేశం పార్టీని బలంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి ?  ఇలా ఏ అంశాల పైన ఇక్కడ చర్చ జరగలేదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని, వైసీపీ ప్రభుత్వం ఎంతోకాలం మనుగడ సాధించలేదని, త్వరలోనే అధికారంలోకి వచ్చేస్తాము అన్నట్లుగా అధినేత తో పాటు, ముఖ్య నాయకులు మాట్లాడిన మాటలు. 

IHG


సొంత పార్టీ నాయకులతో నిర్వహించిన ఈ మహానాడులోనూ మసి పూసి మారేడు కాయ చేసే విధంగా ప్రసంగాలు ఉన్నాయి తప్ప వాస్తవ పరిస్థితులను చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో శ్రద్ధ పెట్టలేదు పోయారు. అలాగే పార్టీ మారాలని చూస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నాయకులను బుజ్జగించి వారికి ధైర్యం చెప్పేందుకే అన్నట్టుగా మహానాడుకి ఏర్పాటు చేసినట్టుగా బాబు కనిపించరు. కార్యకర్తల సమస్యలను విని, వారికి  భరోసా ఇచ్చే విధంగానూ, మనకి మంచి భవిష్యత్ ఉంటుందనే  సంకేతాలు ఇచ్చేందుకు అధినాయకుడూ ప్రయత్నించలేదు. 


చంద్రబాబు రెండు నెలలుగా హైదరాబాద్ కే పరిమితం అయిపోయాడు అనే అపవాదు నుంచి తప్పించుకునేందుకు ఏపీకి వచ్చి తూతూమంత్రంగా మహానాడును నిర్వహించినట్లు గా  ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళ మధ్య జరుగుతున్న చర్చ. మహానాడు వల్ల పార్టీకి గాని, నాయకులకు గాని పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదన్నది ఇప్పుడు ఆ పార్టీ నాయకుల అభిప్రాయం. జగన్ ప్రభుత్వాన్ని తిట్టేందుకే ఈ మహానాడు ని ఏర్పాటు చేశారా అనే ప్రశ్న కూడా ఆ పార్టీ నాయకుల మధ్య చర్చగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: