ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా తో చిక్కుకుపోయిన విదేశీ పర్యాటకులపై హోటల్ సిబ్బంది సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది, వివరాల్లోకి వెళితే.. ధాయిలాండ్ కి చెందిన 41 ఏళ్ల మహిళ మార్చిలో విజిటింగ్ వీసా పై ఇండియాలో పర్యటనకు వచ్చింది . ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో పూర్తిగా విమానాలు రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో థాయిలాండ్ కు చెందిన మహిళ భారత్లోనే చిక్కుకుపోయింది, ఈ నెల 6వ తేదీన హిసార్ లోని రెడ్ స్క్వెర్ మార్కెట్ ఏరియా లో హోటల్లో బస చేసింది ఆ మహిళ.
కాగా విదేశీ మహిళపై హోటల్ మేనేజర్ కన్నేశాడు. ఎలాగైనా ఆమెపై లైంగిక వాంఛ తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 8వ తేదీన తెల్లవారుజామున 4 గంటల సమయంలో.. ఆమె గదిలోకి బలవంతంగా హోటల్ మేనేజర్ గుల్షన్ అతని అనుచరుడు చొరబడ్డారు. ఆ తరువాత దారుణంగా ఆమెపై అత్యాచారం చేసాడు, ఈ విషయమై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోటల్ మేనేజరు ను అరెస్ట్ చేశారు. ఇక మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు,
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి