అయితే తాజాగా సోను సూద్ పై krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కారు పాలన పై ప్రశంసలు కురిపించిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవలే ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భం గా జగన్ తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి చేసిన మంచి పనుల గురించి మాట్లాడారు పోసాని కృష్ణ మురళి.
పులివెందులలో 10 కాలనీలు ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయని అక్కడ స్థలం కొనుగోలు చేసి ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టించారని.. అంతే కాకుండా వైయస్ ఫ్యామిలీ 5 లక్షల మందికి కంటి ఆపరేషన్లు కూడా చేయించారని... ఇక వికలాంగులు మానసిక వికలాంగులకు కూడా జగన్ సతీమణి వైయస్ భారతి జగన్ తో కలిసి సొంత డబ్బుల తో ప్రత్యేకంగా స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యా సదుపాయం కల్పించారని తెలిపారు పోసాని కృష్ణ మురళి. ఇవన్నీ ఎవరైనా చెప్పుకుంటారా... సోను సూద్ కంటే వైయస్ భారతి లక్ష రెట్లు ఎక్కువగా సేవ చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు పోసాని. కానీ ప్రస్తుతం పోసాని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి