పూర్తి వివరాలు తెలుసుకుంటే జైపూర్ జిల్లాలో అమిత్ ఆచార్య అనే 22 ఏళ్ల వ్యక్తి అతి కిరాతకంగా హత్యకు గురయ్యారని పోలీసు అధికారి అయిన సురేందర్ సింగ్ రణావత్ కు సమాచారం అందించారు స్థానిక ప్రజలు. సమాచారం అందుకున్న అతను తన సహోద్యోగుతో కలసి సంఘటనా స్థలానికి చేరుకొని ఐడి కార్డ్ సహాయం తో మృతదేహం అమిత్ ఆచార్య ది అని గుర్తించి కబీర్ నగర్ సోగాల లో నివసిస్తున్న అమిత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన పోలీసులకు అమిత్ ఆచార్య శుక్రవారం రాత్రి సోను, వికాస్ మెహ్రా తో కలిసి బయటికి వెళ్ళాడని తెలిసింది.
దాంతో వారిని విచారించగా తామే అమిత్ ని హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. అయితే అమిత్ ని చంపడానికి గల కారణం ఏంటో పోలీసులు ఆరా తీయగా... అమిత్ ఆచార్య తన చెల్లితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. ఎన్నిసార్లు చెప్పినా అతడు ప్రవర్తన మార్చుకోలేదని.. అందుకే అతడిని అంతమొందించామని నిందితుడు సోను చెప్పుకొచ్చాడు. శుక్రవారం నాడు రాత్రి సమయంలో మందు పార్టీ చేసుకున్న అనంతరం అతడిని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి హత్య చేసినట్లు నిందితుడు చెప్పుకొచ్చారు. అమిత్ ని హత్య చేయడానికి తన ఫ్రెండు వికాస్ కూడా సహాయం చేసినట్టు వెల్లడించాడు. ఏది ఏమైనా క్షణికావేశంలో చెడ్డ వారిని చంపే క్రమంలో చట్టాన్ని చేతిలోకి తీసుకొని చాలా మంది నేరస్థులు అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి