కానీ ఢిల్లీ లోని కేంద్రం ఈ విషయాన్నీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే ఉంది.. అవసరం వచ్చినప్పుడు ఈ విషయాన్నీ ఆలోచిద్దామని బీజేపీ అనుకోగా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రఘు రామ కృష్ణం రాజు టీడీపీ మాదిరి వైసీపీ విమర్శించడం మొదలుపెట్టారు.. కొందరు నాయకులను టార్గెట్ చేసి జగన్ ను సైతం విమర్శిస్తూ జగన్ ఆగ్రహాన్ని కూడా కొనితెచ్చుకున్న. అయితే వైసీపీ లో రఘు రామ ను ఇంకేం చేయలేమా అనే భావన మొదలైన నేపథ్యంలో ఆయనను మాజీ చేయడానికి ఓ అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు..
దాంతో వారికి విశ్వసనీయత పరీక్ష ఎదురుకానుంది.. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరిని పార్టీలో చేర్చుకోవాలి. అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీని ఎన్డీయేలోకి తీసుకురావడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా మా బలం పెరిగింది అని చెప్పుకోవచ్చు. అలాగే సౌత్ లో మేము గట్టిగా ఉన్నాం, తెలుగు రాష్ట్రాలో ఒక చోట మిత్ర పక్ష ప్రభుత్వం ఉందని కూడా ఢంకా భజాయించి చెప్పుకోవచ్చు. అందుకే బీజేపీ ఇపుడు జగన్ ని చేరదీస్తోందని అంటున్నారు. అయితే జగన్ కూడా రఘు రామ కృష్ణం రాజు విషయం తేల్చితే కానీ సపోర్ట్ విషయంలో ఏ నిర్ణయం చెప్పలేను అన్నట్లు వ్యవహరిస్తుండడంతో బీజేపీ అనర్హత వేటును మరొకసారి పరిశీలించనుంది.. ఒకవేళ అన్ని అనుకున్నట్లు అయితే రఘు రామ కృష్ణ రాజు తొందరలో మాజీ ఎంపీ అవనున్నాడన్న మాట..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి