ఏకంగా కన్న తండ్రి కొడుకులను దారుణంగా హత్య చేయడమే కాదు... ఎవరికి తెలియకుండా రహస్యంగా పాతిపెట్టాడు ఇక్కడ ఒక కసాయి తండ్రి. ఏకంగా తండ్రే కొడుకుల పాలిట యమకింకరుడు గా మారిపోయాడు. పిల్లల ఆలనా పాలనా చూసుకుని పెంచి పెద్దచేసి ప్రయోజకులను చేస్తాడు అనుకుంటే చివరికి... కొడుకుల ప్రాణాలు తీసేసిన విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లె లో ఓ వ్యక్తి తన ఇద్దరు కొడుకులతో కలిసి నివసిస్తున్నాడు. అయితే అతనికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో తరచూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు ఉండేవాడు. అయితే మతిస్థిమితం లేని తండ్రి చేతిలో చివరికి ఇద్దరు కొడుకులు బలి కావాల్సి వచ్చింది. మతిస్థిమితం లేని తండ్రి బుధవారం రాత్రి సమయంలో ఇద్దరు కొడుకులను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. తర్వాత ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇద్దరు కొడుకులను గొయ్యి తవ్వి పూడ్చి పెట్టాడు. ఇక ఆ తర్వాత ఇద్దరు చిన్నారులు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన పోలీసులు తండ్రి రవిని అదుపులోకి తీసుకొని విచారించగా ఎంతో అసలు నిజం బయటపడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి