కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే విధంగా రైతులందరి కీ చేయూతనందించే విధంగా ఎన్నో సంక్షేమ పథకాల ను కూడా ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఒక ఇటీవలే ఏకంగా వ్యవసాయ అభివృద్ధి కోసం సరికొత్త వ్యవసాయ చట్టాల ను కూడా తీసుకొచ్చింది. అయితే దీనిపై దేశవ్యాప్తం గా రైతులందరూ సానుకూలంగా నే ఉన్నది తెలుస్తోంది. ఎందుకంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ చట్టం రైతుల కు అన్యాయం చేస్తుందని ఎంతగానో గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే.




 వ్యవసాయ చట్టాల పై విమర్శలు చేస్తూ నిరసన ర్యాలీలు చేపడుతూ రోజుల తరబడి వ్యవసాయ చట్టం పై విమర్శలు గుప్పించినప్పటికీ రైతుల నుంచి మాత్రం ఈ వ్యవసాయ చట్టం పై వ్యతిరేకత రావడం లేదు. అదే సమయం లో రైతులందరి కీ ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు కూడా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులందరూ పంటకు సంబంధించిన ఎరువులు విత్తనాల ను కూడా ఎంతో సులభంగా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.



 రైతులందరికీ చేయూత  అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం కిసాన్  క్రెడిట్ కార్డు లే కాకుండా పశువులను కొనేందుకు కూడా భారీగా  రుణం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమలను  మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి తరహా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త సదుపాయం ద్వారా పాడి పరిశ్రమ పై ఆధారపడి జీవించే ఎంతో మంది రైతుల కు చేయూత అందే అవకాశం ఉంది అన్న విషయం తెలిసిందే. ఎంతో  మంది రైతులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: