అతివేగం రోడ్డు నిబంధనలు పాటించక పోవడం వెరసి రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలం లో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా తెర మీదకు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తున్న తరుణం లో ఏకంగా రోడ్డు ప్రమాదం కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికం గా ఒక్కసారిగా కలకలం సృష్టించింది. గోకవరం మండలం తంటికొండ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి కొండ పైనుంచి కింద పడిపోయింది.



 ఈ ప్రమాదం లో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు వదిలారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను గోకవరం ఆస్పత్రికి  తరలించారు. అయితే అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని స్థానికులు కూడా భావిస్తున్నారు. ఎంతో సంతోషం గా పెళ్లికి వెళ్లి వస్తున్న తరుణంలో విధి వక్రించి రోడ్డు ప్రమాదంలో రూపంలో ఏకంగా ఆరుగురి ప్రాణాలను బలి తీసుకోవడంతో  విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక మృతుల కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి.



 అయితే ఈ రోడ్డు ప్రమాదం గురించి వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టిన అధికారులు బాధితులు మృతులను రాజమండ్రి గోకవరం లలోని  ఆసుపత్రులకు తరలించారు. అయితే వేగంగా వెళ్తున్న సమయంలో బ్రేక్ ఫెయిల్ కావడం వల్లనే రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎఇలా లా రోడ్డు ప్రమాద ఘటనలు  పెరిగిపోతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: