ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఏడాది క్రితం అమరావతి ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ.. జనభేరి పేరుతో భారీ సభను నిర్వహించారు. ఈ భారీ సభకు విపక్ష పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. అటు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో బీసీ సంక్రాంతి సభను నిర్వహించారు. ఇటీవల ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల ఛైర్మన్‌లు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి యంగ్ అండ్ డైనమిక్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు.

జనభేరి సభను ప్రస్తావిస్తూ.. బీసీ సంక్రాంతి సభలో చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన కామెంట్లు చెయ్యడం జరిగింది.చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ ఈ విధంగా మాట్లాడాడు. ఆయన  ఒక దిగిపోయిన పాలకుడు, చెడిపోయిన బుర్రతో.. సొంత లాభం కోసం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేశారని ఆరోపించారు. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు చంద్రబాబు బినామీలతో భూములు కొనుగోలు చేసి.. అక్కడే రాజధాని పెట్టాలని ముందే నిర్ణయించారని అన్నారు. తన బినామీలతో చుట్టు పక్కల భూములు కొనుగోలు చేయించారని.. ఆ కొన్న భూముల ధరలు ఎక్కడ పడిపోతాయన్న భయంతో ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు.ఇక ఇలాంటి మరెన్నో పొలిటికల్  అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..ఇంకా మరెన్నో రాజకీయ వార్తలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: