సాధారణంగానే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి లవ్ స్టోరీ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే ఇటీవలే.. సామ్ జామ్ అనే కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ తన భార్య తో తొలి పరిచయం గురించి ప్రేమ పెళ్లి సంగతులను గురించి చెప్పుకొచ్చారు. మీ భార్య స్నేహారెడ్డి లో మీకు నచ్చింది ఏంటి అంటూ సమంత ప్రశ్నకు సమాధానంగా.. ఆమెలో ఉన్న డిగ్నిటీ తనకు బాగా నచ్చిందని.. ఓ సందర్భాన్ని వివరించాడు.. ఫస్ట్ టైం స్నేహ రెడ్డిని నైట్ క్లబ్బులో పార్టీలో చూసానని.. రాత్రి రెండుగంటల సమయంలో కూడా అందరిలో ఆమె ఎంతో డిగ్నిటీ గా కనిపించిందని.. అప్పుడే స్నేహ నచ్చేసింది అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.
ఇక తన కొడుకు అయాన్ గురించి చెప్పుకొస్తూ తన కొడుకు అయాన్ కి కెమెరా అన్న.. ఫోటోలు తీయడం అన్న ఇష్టముండదని.. కానీ తన కూతురు మాత్రం ఈ విషయంలో ముందు ఉంటుందని అందుకే తన ఫోటోలు మొత్తం తన కూతురు తోనే ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. తాను ఇంట్లో ఉంటే సమయం మొత్తం అయాన్ తోనే గడుపుతాను అంటూ తెలిపాడు. ఇలా ఎన్నో విషయాలను అభిమానులతో సామ్ జామ్ అనే కార్యక్రమంలో పంచుకున్నాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇలా సమంత చిలిపి ప్రశ్నలు తో.. అల్లు అర్జున్ ఆకర్షణీయమైన సమాధానాలతో ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి