ఈ మధ్య కాలం లో డబ్బులు సంపాదించడం అనేది అంత సులువైన పనేమీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఎంతో మంది డబ్బులు సంపాదించడానికి ఏళ్లతరబడి కష్టపడుతూ ఉంటారు.. కానీ ఒకేసారి కోటీశ్వరుడు కావడం అనేది అది కలలో మాటే అని చెప్పాలి. కానీ కొంతమందికి మాత్రం అదృష్టం వరించి కేవలం ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు గా మారి పోతూ ఉంటారు. ఇక్కడ ఓ వ్యక్తికి ఇలా అదృష్టం వరించింది. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మస్కట్లో ఉపాధి నిమిత్తం వెళ్ళాడు ఇక అక్కడ ఓ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.


 ఇక ఎంత కష్టపడినా కూడా ఎక్కువగా డబ్బులు వెనకేసుకో  లేకపోతున్నాడు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఒక్కసారైనా అదృష్టం వరించపోతుందా  అని ఆశగా ఎదురు చూస్తున్నాడు సదరు వ్యక్తి.  అయితే అదృష్టం వరించాలని  దేవుని గట్టిగా కోరుకున్నట్టున్నాడు. దీంతో దేవుడు అతనికి వరం అందించాడు.  ఈ క్రమంలోనే కేవలం ఒక్క రాత్రిలో అతడు కోటీశ్వరుడు గా మారిపోయాడు. ఇది ఎలా జరిగింది అని..  అంతా లాటరీ మహిమ .ఈ మధ్యకాలంలో భారత్ నుంచి ఉపాధి నిమిత్తం అరబ్ దేశాలకు వెళ్లిన ఎంతోమందికి అదృష్టం వరించి భారీ లాటరీలు తగులుతూ కోటీశ్వరుడు గా మారుతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఇటీవలే కేరళకు చెందిన వ్యక్తి కూడా ఇలా అదృష్టం వరించగా  ఓకే  నైట్ లో  కోటీశ్వరుడు గా మారిపోయాడు. మస్కట్ కి వెళ్లి అక్కడ ఓ షాపు నిర్వహిస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు కేరళకు చెందిన వ్యక్తి. అయితే కేరళకు చెందిన అబ్దుల్ సలామ్ అనే వ్యక్తి ఇటీవలే రఫల్ లాటరీ టికెట్ కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. లాటరీ టికెట్ కొనగానే దేవుడు వరం ఇచ్చినట్లు ఉన్నాడు. అతడు కొనుక్కున్న లాటరి టికెట్ కాస్త కోట్లు పలికింది ఏకంగా ఒక్క లాటరీలో 39 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు సదరు వ్యక్తి. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ సంతోషాన్ని స్నేహితులందరి తో పంచుకుంటు ఎగిరి గంతేసాడు సదరు వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: