సీనియర్ కథానాయికలు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా తమిళ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సీనియర్ నటి శోభన ఈ ఏడాదే తమిళ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.ఏపీ రాజకీయాల్లో ‘ఫైర్ బ్రాండ్’గా సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి రోజా, ఇప్పుడు మళ్ళీ తన సొంత గూటికి చేరుకున్నారు. రాజకీయాల్లో కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ఈ ‘జాబిలమ్మ’, ఇప్పుడు వెండితెరపై తన మార్క్ ‘మాస్’ హంగామా చూపించడానికి రెడీ అయ్యారు. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి రోజా గ్రాండ్ రీఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో "హై-వోల్టేజ్" టాపిక్‌గా మారింది.
పారి ఎలవళగన్ హీరోగా, రమ్య రంగనాథన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘అన్బే డయానా’. ఈ సినిమాలో రోజా హీరో తల్లిగా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ‘పెరంబూర్ గానా’ అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాటలో రోజా వేసిన మాస్ స్టెప్పులు చూస్తుంటే, పాత రోజుల్లోని రోజా ‘స్ట్రైక్స్ అగైన్’ అన్నట్లుగా ఉంది. హీరోయిన్ రమ్య రంగనాథన్, హీరో పారిలతో కలిసి రోజా వేసిన చిందులు ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్టింట పూనకాలు తెప్పిస్తున్నాయి. కేవలం డాన్సులకే పరిమితం కాకుండా, ఈ సినిమాలో రోజా క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా సాగుతుందని డైరెక్టర్ హింట్ ఇచ్చారు.
రాజకీయాల నుంచి బ్రేక్ దొరకగానే రోజా ఏమాత్రం లేట్ చేయకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.సంతానం హీరోగా నటిస్తున్న ‘లెనిన్ పాండ్యన్’ మూవీతో రోజా తన రీఎంట్రీని ఖరారు చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది.దీనితో పాటు ‘అన్బే డయానా’ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవలే రాధిక నటించిన ‘తాయి కిళవి’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, ఇప్పుడు సీనియర్ నటి రోజా సినిమాలపై కూడా కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి