సాధారణంగా ఎక్కువమంది డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి ఎక్కువగా ఆర్ టి ఓ ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఆన్లైన్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడం ఎంతో ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. దీని కోసం ప్రతి ఒక్కరూ ముందుగా..http://parivahan.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇక వెబ్ సైట్ ఓపెన్ చేయగానే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సర్వీసులు అని ఉంటుంది. ఇక ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసులు ఆప్షన్ ఎంచుకోవాలి.. ఇక ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ యొక్క పూర్తి నెంబర్ ఎంటర్ చేసి.. ఇక అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఆ తర్వాత ఆర్ టి ఓ ఆఫీస్ లో స్లాట్ బుక్ చేసుకుని.. ఇక ఫ్లాట్ బుక్ అయిన సమయం ప్రకారం ఆర్ టి ఓ ఆఫీస్ కి వెళ్లి బయోమెట్రిక్ ఇస్తే సరిపోతుంది. ఇక వెంటనే వెరిఫికేషన్ పూర్తయి మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అవుతుంది. ఒకవేళ మీ వయస్సు 40 ఏళ్లు దాటి ఉంటే డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీ అయిపోయిన నెల రోజుల లోగా రెన్యువల్ చేసుకోవడం ఎంతో మంచిది. 30 రోజులు దాటిన తర్వాత రెన్యువల్ చేసుకోవాలి అంటే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి