ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు పూర్తి కాగా, అందులో వైసీపీ విజయాన్ని అందుకుంది. అనుకున్న స్థానాలతో పోలిస్తే తక్కువ నియోజక వర్గాల్లో టీడీపీ జెండాను ఎగురవేశారు. ఇప్పుడు మిగిలిన మూడు విడతల మీదనే అందరి దృష్టి పడింది. ఇక రెండో విడత నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతలు నిన్నటి వరకు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ఈరోజు ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు.


ఇది ఇలా ఉండగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన  వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త రాజకీయ రచ్చలకు దారి తీసింది.ఎస్‌ఈసీ చర్యలపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్‌ఈసీ చర్యలపై సంతృప్తిగా లేమని వర్ల రామయ్య అన్నారు. ఓటర్లను బెదిరించేలా జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఆంక్షలు కేవలం కంటితుడుపు మాత్రమేనన్నారు. ఎస్‌ఈసీ సీరియస్‌గా తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం పై చంద్ర బాబు సీరియస్ అయ్యారు. పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) పూర్తిగా విఫలమైందని  ఆరోపించారు.



ఎస్‌ఈసీ తన అధికారాలను పూర్తిగా వినియోగించలేదన్నారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే తెదేపా మద్దతుదారులపైనే కేసుల పెడుతున్నారని ఆరోపించారు.పుంగనూరు, రొంపిచర్ల, సోమల, చౌడేపల్లి తదితర ప్రాంతాల్లో నామినేషన్లు పెద్ద ఎత్తున తిరస్కరించారని ఆక్షేపించారు. అడ్డగోలుగా నామినేషన్లు తిరస్కరించి ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతున్నారని బాబు అన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు సమానమైన హక్కులు, అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలో దుస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం. రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రికి కూడా వివరాలు పంపుతాం, ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయి. రాజ్యాంగ వ్యవస్థను నియంత్రించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: