ప్రతి ఒక్కరూ వాహనం నడపాలి అంటే తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి అనే విషయం తెలిసిందే.  లేనిపక్షంలో నిబంధనలను ఉల్లంఘించి వాహనం నడిపి ట్రాఫిక్ పోలీసులకు దొరికారు అంటే భారీగా జరిమానా విధించడమే  కాదు వాహనాన్ని సీజ్ చేసే అవకాశం కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ఇలా వివిధ రకాల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ తక్కువ మొత్తంలో మాత్రమే జరిమానా విధించే వారు. అంతేకాకుండా ఎప్పుడో ఒకసారి మాత్రమే ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఎంతోమంది లైసెన్స్ లేకపోయినప్పటికీ ఇక వాహనాలు నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితులు అలా లేవు. ఇక ఏమాత్రం నిబంధనలను అతిక్రమించిన జేబులకు చిల్లులు పడే అవకాశం ఉంది. అంతే కాకుండా వాహనం సీజ్  అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.  ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లైసెన్స్ పొందడమే కాదు ఇక అన్ని ట్రాఫిక్ రూల్స్ కూడా పాటిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఒకవేళ ప్రస్తుతం లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే భారీగా జరిమానాలు విధిస్తూ వాహనదారులకు ఊహించని షాక్ ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.  ఇకపోతే సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అంటే ముందుగా ఆర్టిఏ ఆఫీస్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.



 ఇక అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ముందుగా వాహనదారుడుకి లెర్నర్ లైసెన్స్ ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే లెర్నర్  లైసెన్సు ఉన్నప్పుడు కూడా మరిన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఎల్ఎల్ఆర్ జారీ చేసిన తర్వాత ఆరు నెలల వరకు చెల్లుతుంది. అయితే ఇలా ఎల్ఎల్ఆర్ పొందిన హోల్డర్ డ్రైవింగ్ చేయాలి అంటే అనుభవజ్ఞుడైన డ్రైవింగ్ లైసెన్స్  హోల్డర్ మీతో పాటు ఉండాలి.  మీ వాహనంపై కేవలం బోధకుడిని  తప్ప మరొకరిని తీసుకెళ్లకూడదు. అంతేకాకుండా మీ వాహనానికి వెనక ముందు ఎల్ అనే గుర్తును పెట్టుకోవాలి.  ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనం నడపాలి.  నిబంధనలు పాటించకపోతే ఎల్ఎల్ఆర్ రద్దు అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: