కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం(బంద‌రు) పురపాలక సంఘం ర‌ద్ద‌యి.. ఇప్పుడు మునిసిపల్‌ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది.ఈ నేప‌థ్యంలోనే తాజాగా కార్పొరేషన్‌ హోదాలో తొలిసారిగా ఈ నెల 10 న ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్క‌డ ఎటు చూసినా.. వైసీపీ గాలులు వీస్తున్నాయి. మంత్రి పేర్నినాని సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ వైసీపీని గెలిపించి.. త‌న మంత్రి ప‌ద‌విని నిల‌బెట్టుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, బంద‌రు మేయర్‌ పదవిని జనరల్‌ మహిళకు రిజర్వు చేశారు. స్థానికంగా నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా తొలి మేయర్‌ పదవి ఎవరిని వరిస్తుందనే అంశంపై చర్చ కొనసాగుతోంది.

స్థానిక సంస్థల్లో సగం సీట్లు మహిళలకు కేటాయించాల్సి రావడంతో 25 డివిజన్లలో మహిళా అభ్యర్థులు కార్పొరేటర్లుగా పోటీలో ఉన్నారు. ఇక‌, బంద‌రులో పాగా వేసేందుకు వైసీపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. మంత్రి పేర్ని వ్యూహాత్మంగా పావులు క‌దుపు తున్నారు. పైకి ఆయ‌న మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇంటి నుంచి అన్ని కార్య‌క్ర‌మాలు చ‌క్క‌బెడుతున్నారు. దీంతో వైసీపీలో భారీ జోరు క‌నిపిస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు ప‌రుగులు పెట్టి మ‌రీ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. అయితే.. అదేస‌మ‌యంలో టీడీపీ కూడా దూకుడుగానే ఉన్నా.. కొన్ని చోట్ల మాత్రం బ‌ల‌హీనంగా ఉంది.

 మా జీ మంత్రి కొల్లు ర‌వీంద్ర కూడా ఇక్క‌డ టీడీపీని గెలిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మచిలీపట్నం మండలంలో రెండు పంచాయతీలను జనసేన తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు పంచాయతీల్లోనూ టీడీపీ జనసేన కలసి పోటీ చేయడంతో ఈ విజయం సాధ్యమైంది. పురపాలకసంఘాల్లో జరిగే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదనిపైకి చెబుతున్నా మచిలీపట్నంలోని కొన్ని డివిజన్లలో టీడీపీ, జనసేన  కలయికతోనే ఎన్నికలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఎన్ని డివిజన్లలో జనసేన అభ్యర్థులు గెలుపొందుతారు, ఈ ప్రభావం వైసీపీ, టీడీపీపై ఎంతమేరకు ప్రభావం చూపుతుందనేది చర్చనీయాంశంగా మారింది.  ప్ర‌స్తుతం ఎవ‌రికి వారుగానే ప్ర‌చారం చేసుకుంటున్నారు. కానీలోపాయికారీగా మాత్రం ఇరు పార్టీల మ‌ద్య తెర‌చాటు ఒప్పందం జ‌రిగింద‌ని అంటున్నారు. మ‌రి ఇది ఏమేర‌కు ఇరు పార్టీల‌కు లాభిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: