తాను వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నట్లు కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రచారం చేయడం తన మనస్సును గాయపర్చిందని తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తంచేయడంతో పాటు ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. తాను రాజకీయల్లోకి వచ్చినప్పటినుండి టిడిపిలోనే కొనసాగానని, ఇకనుండి కూడా కొనసాగుతానని వెల్లడించారు. దివంగత వైఎస్ఆర్ తో నేను రాజకీయంగా పోరాడానని ఇప్పుడు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రజలను ఎలా మోసం చేస్తుందోననే విషయాన్ని తెలియజేస్తానని పయ్యావుల తెలిపారు. అసత్య ప్రచారాలు చేయడం మీడియా మానుకోవాలని, కొన్ని పార్టీలు అసత్య ప్రచారాలు చేయడం కోసమే చానళ్లు, పత్రికలు పెట్టుకున్నాయని పరోక్షంగా సాక్షి చానల్ పై ద్వజమెత్తారు. వార్త ప్రసారం చేసే ముందు మొత్తం తెలుసుకోవాలని పాత్రికేయులను కోరారు. నాపై ప్రచారం చేసినటువంటి వారేవరో తన ముందుకు వచ్చి ఎవరు చెప్పారో తెలియజేయాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: