బీరకాయలలో కెలోరీలు తక్కువగా ఉండి అధికభాగం విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉన్న పోషకాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.బీరకాయ తినడం ద్వారా మనకు కడుపునిండిన భావన కలగడంతో ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడరు. తద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు. బీరకాయలో
మన శరీరానికి కావాల్సిన పెప్టైడ్స్, ఆల్క్‌లైడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీర రక్షణ వ్యవస్థను దృఢంగా ఉంచుతుంది.
అదేవిధంగా మధుమేహంతో బాధపడేవారికి బీరకాయ ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. బీరకాయ మన శరీరానికి కావలసినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది.అదే విధంగా ఇందులో అధిక భాగం పీచు పదార్థం ఉండటం వల్ల ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి దోహద పడుతుంది. బీరకాయను వారంలో రెండుసార్లు ఆహార పదార్థాలలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కాకుండా, సౌందర్య ప్రయోజనాలను కూడా పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా మన శరీరానికి కావలసినంత తేమను అందించడంలో బీరకాయలు దోహదపడతాయి. తద్వారా మన శరీరం కాంతివంతంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
click and follow Indiaherald WhatsApp channel