దీంతో వైశ్య సామాజిక వర్గం రాజకీయాలు.. ముందుకు నాలుగు అడుగులు, వెనక్కి ఆరు అడుగులు అన్నచందంగా మారిపో యాయి. ఇక, రాష్ట్ర విబజన తర్వాత వీరి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టయింది. పార్టీల పరంగా విడిపోయిన ఈ సామాజిక వర్గం.. ఐక్యత కోల్పోయిందనే చెప్పాలి. తమ వ్యాపారాలు బాగుంటే.. చాలని.. రాజకీయంగా తాము దూకుడు చూపించలేమనే ధోరణిలోకి నాయకులు వెళ్లిపోయారు. దీంతో వైశ్య సామాజిక వర్గం రాజకీయ రాణింపు దాదాపు కోల్పోయింది. ఇప్పుడు చాలా మంది నాయకులు ఉన్నప్పటికీ.. రాణింపు లేక సతమతమవుతున్నారు.
ఎప్పటికప్పుడు మీటింగులు పెట్టుకుని తమ సమాజాన్ని బలోపేతం చేసుకుంటామని..చెబుతున్నారే తప్ప.. ఆదిశగా చర్యలు మాత్రం ఇప్పటి వరకు చేపట్టకపోవడం గమనార్హం. తాజాగా జరిగిన ఆర్య వైశ్యసంఘం సమావేశంలోనూ నాయకలుఉ ఐకమత్యమే మహాబలమని నాయకులు పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఒక్క రాజకీయ రంగంలో మాత్రమే చాలా దూరంగా ఉన్నారని తెలిపారు. ఆర్యవైశ్యులు మృదు స్వభావం గల వారని, అందువల్లే రాజకీయాల్లో రావడానికి సాహసం చేయలేక వెనుకబడుతున్నార న్నారు.
పదిమందికి సాయం చేసే గుణం మనలో ఉన్నా ముందుకు వెళ్లలేకపోతున్నామన్నారు. ఆర్యవైశ్యులు ఏకతాటిపైకి వస్తే ఏ రంగంలోనైనా దూసుకువెళతారన్నారు. ఇంత వరకు బాగానేఉన్నా.. టీజీ వెంకటేశ్, కొణిజేటి రోశయ్య,. ప్రస్తుతం ఉన్న వెలంపల్లి శ్రీనివాస్.. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వంటివారు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా.. ఇంకా వీరు వెనుకంజ వేయడం.. సందేహాలు వ్యక్తం చేయడం వంటి పరిణామాలు.. ఈ సమాజాన్ని రాజకీయంగా ఇప్పట్లో బలోపేతం చేయలేవనే విమర్శలు వచ్చేలా చేస్తుండడం గమనార్హం. సో.. ఇప్పటికైనా సందేహాలు మానుకుని.. సమరం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వైశ్య సామాజిక వర్గానికి చెందిన నిజమైన కోరికలు.. డిమాండ్లు.. సాధించుకునేందుకు.. అటు ప్రభుత్వానికి, ఇటు రాజకీయ నేతలకు తమ గళాన్ని వినిపించేందుకు వైశ్యుల పక్షాన నడుం బిగించింది https://www.indiaherald.com. వైశ్య సామాజిక వర్గం సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, వారికి అన్ని విధాలా అండగా నిలిచేందుకు https://www.indiaherald.com నిర్ణయించింది.
వైశ్య సామాజిక వర్గం సోదరులు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు.. చేయాల్సిందల్లా.. ఈ ఫోన్ నెంబరు 8919011959 కు ఫోన్ చేయడమే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ సమస్యను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడమే..! మీ తరఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ సమస్యల పరిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్యమంలో ప్రతి వైశ్య సోదర, సోదరీమణులకు భాగస్వామ్యం కల్పిస్తోంది https://www.indiaherald.com/
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి