మొన్నటి వరకు దేశంలో అతి తక్కువ ఉన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య ప్రస్తుతం శరవేగంగా పెరిగిపోతుంది. అటు ప్రజలందరూ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది. వెరసి రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. అయితే గత ఏడాది ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.  కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించక పోయినప్పటికీ వివిధ రాష్ట్రాలలో వైరస్ విజృంభణ భారీగా ఉండడంతో ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించే పరిస్థితులు వస్తున్నాయి.


 అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య దారుణంగా పెరిగి పోయింది అని చెప్పాలి. ప్రతిరోజు మూడు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చి నియంత్రణకు  చర్యలు చేపడుతున్నాయి.  ప్రజలందరూ కూడా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారాలు మాత్రం అందరిలోనూ ప్రాణ భయాన్ని కలిగిస్తున్నాయి.  ఇక ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్న తీరు చూస్తే అసలు దేశంలో కరోనా వైరస్ అనేది లేదు అన్న విధంగా ఉంది పరిస్థితి.



 ఓవైపు రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉండటం అంతేకాకుండా మహమ్మారి వైరస్ బారినపడి మరణిస్తున్నారు వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి ఇక ప్రజల ప్రాణాల కంటే ఎన్నికల ప్రచారం ముఖ్యం అన్న విధంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.  బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కారణంగానే కేసులు పెరిగాయని విమర్శలు రాగా.. ఇటీవల తెలంగాణలో కూడా సాగర్ ఉప ఎన్నికల ప్రచారం కారణంగా కేసులు పెరిగాయి అని ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉండడం మాత్రం అందరిలోన ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: