డూప్లెక్స్ భవనం నాలుగు, ఐదు అంతస్తులలో ఉందని సుమారుగా 14,369 చదరపు అడుగుల విస్తీర్ణంలో కలదు. ఈ లగ్జరీ విల్లా విశాలవంతమైన పార్కింగ్ స్థలం కూడా ఉన్నదట. అయితే ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత ఏడాది డిసెంబర్ లోనే పూర్తి అయినట్టు సమాచారం. ఇప్పటికే నయనతారకు హైదరాబాద్ బంజారాహిల్స్ వద్ద రెండు లగ్జరీ విల్లాలు కలవు. వాటి విలువ కూడా రూ .15 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే నయనతార పూర్వీకులు కేరళ రాష్ట్రం వారు కావడం చేత అక్కడ అత్యంత విలాసవంతమైన ఇల్లాలు ఉన్నట్లు తెలుస్తోంది.
నయనతార సినిమాల విషయానికి వస్తే చివరిగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటించి అద్భుతమైన విజయాన్ని అందించింది. ప్రస్తుతం హీరో యష్ నటించిన టాక్సిక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మార్చి 19వ తేదీన విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. అలాగే పలు లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది నయనతార. నయనతార భర్త విఘ్నేష్ శివన్ కూడా ప్రముఖ డైరెక్టర్ గా పేరు సంపాదించారు. అంతేకాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలకు వ్యవహరిస్తున్నారు ఈ జంట. నయనతార రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఒక్క చిత్రానికి రూ .10 కోట్ల రూపాయల నుంచి రూ .15 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి