కానీ.. ఈ ఆన్ లైన్ పంపిణీ కోసం తయారు చేస్తున్న వెబ్ సైట్ పై ఇప్పటికే ఆరోపణలు రావడంతో అది కాస్తా ఆగిపోయింది. అయితే ఈ సమయంలో ఆనందయ్య ఓ కీలక ప్రకటన చేశారు. మందు కోసం ఇతర జిల్లాల నుంచి ప్రజలు కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలతో కొంతమంది కృష్ణపట్నం వస్తున్నారని... ఇలా రావద్దని ఆనందయ్య మరోసారి సూచించారు. అంతే కాదు. ప్రతి జిల్లాకు తన మందును పంపేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆనందయ్య గుడ్ న్యూస్ చెప్పారు.
తన మందును అందరికీ అందించేందుకు ప్రభుత్వం కూడా తనకు సహకారం అందించాలని ఆనందయ్య కోరారు. ముందు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఆయుర్వేద మందు పంపిణీ చేసిన తర్వాత మిగిలిన జిల్లాల హెడ్ క్వార్టర్ కు ఆయుర్వేద మందు ను అందజేస్తామని ఆనందయ్య వివరించారు. మందు తయారీ, పంపిణీలో ప్రతి ఒక్కరు తనకు సహకరించాలని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.
సో.. ఇప్పుడు ఆనందయ్య మందు కాస్త మెల్లగా అయినా అన్ని జిల్లాల కేంద్రాలకు చేరుతుందన్న మాట. కానీ.. రాష్ట్రంలో ఆనందయ్య మందుకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ స్థాయిలో మందు తయారు చేయడం అంటే కత్తి మీద సామే. మరి ఆనందయ్య ఈ ఫీట్ ఎలా చేస్తారో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి