ఇక గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా గమనించినట్లయితే 9వేలకు దిగవనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతలో మునుపటి జోరు లేదు. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మొత్తం 1,01,863 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 8,239 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వడం జరిగింది. ఇక ఎప్పటిలాగే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,396 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి. ఇక రెండవ స్థానంలో తూర్పు గోదావరి జిల్లా వుంది. ఆ జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం 1,271కొత్త కరోనా కేసులు గుర్తించారు. ఇక అలాగే అత్యల్పంగా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో 201 పాజిటివ్ కేసులు నమోదవ్వడం జరిగింది.

ఇక అదే సమయంలో రికవరీల విషయానికి వస్తే 11,135 మంది కరోనా వైరస్ నుంచి రికవరీ అయ్యి కోలుకోగా, 61 మంది కరోనా ప్రభావంతో మృతి చెందడం జరిగింది. ఇక అలాగే చిత్తూరు జిల్లాలో 10 మంది కరోనా మహమ్మారి ప్రభావంతో కన్నుమూశారు.ఇక మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు 11,824 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక ఇప్పటిదాకా మొత్తం 17,96,122 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 16,88,198 మంది కరోనా నుంచి కోలుకొని ఆరోగ్యవంతులయ్యారు. అలాగే ఇప్పుడు ఇంకా 96,100 మంది చికిత్స పొందుతున్నారు.


ఇక జిల్లాల వారీగా ఎంత మంది చనిపోయారో చూసుకుంటే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 10 మంది మరణించగా, ప్రకాశం జిల్లా , శ్రీకాకుళం జిల్లా , పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున, విశాఖపట్నం జిల్లాలో ఆరుగురు, అనంతపురం జిల్లా , తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, వైయస్ ఆర్ కడప జిల్లా, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు జిల్లా , కర్నూలు జిల్లా , నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: