ప్ర‌స్తుతం క‌రోనా దేశంలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రినీ క‌బ‌లిస్తోంది. ఆరోగ్యంగా ఉన్న వారిని కూడా చంపేస్తోంది. దేశంలో కరోనా మొద‌టి వేవ్ కంటే కూడా రెండో వేవ్‌లో ప్రాణనష్టం ఎక్కువ‌గా ఉంటోంది. ఇక సాధారణ ప్రజల మ‌ర‌ణాల కంటే కూడా కూడా మ‌న‌కోసం పోరాడుతున్న డాక్ట‌ర్లే ఈ వైర‌స్‌కు ఎక్కువ‌గా బలవ్వడం మింగుడు పడ‌ట్లేదు. దేశ‌వ్యాప్తంగా రెండో వేవ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 624 మంది డాక్టర్లు చ‌నిపోయారు.

ఈ విష‌యాన్ని భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) తాజాగా ప్ర‌క‌టించింది. కాగా ఢిల్లీలో  క‌రోనాకు ఏకంగా 109 మంది డాక్ట‌ర్లు బలైనట్లు తెలిపింది. ఇక బిహార్‌లో అయితే 96 మంది డాక్టర్లు మ‌ర‌ణించారు. ఇప్ప‌టి దాకా కరోనా సెకండ్ వేవ్ టైమ్‌లో మహారాష్ట్రలో 23 మంది డాక్ట‌ర్లు చ‌నిపోయారు. అలాగే ఉత్తర్‌ ప్రదేశ్‌లో 79 మంది వైద్యులు మ‌ర‌ణించారు. రాజస్థాన్‌లో 43 మంది అసువులు బాసారు. అలాగే ఝార్ఖండ్‌లో 39 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 34 మంది మ‌ర‌ణించిన‌ట్టు ఐఎంఏ స్ప‌ష్టం చేసింది.

ఇక మ‌న తెలంగాణలో అయితే 32 మంది తో పాటు గుజరాత్‌లో 21 మంది డాక్ట‌ర్లు మ‌ర‌ణించారు. క‌రోనా మొదటి వేవ్‌తో పోల్చుకుంటే సెకండ్ వేవ్‌లోనే వైరస్ ఉధృతి ఎక్కువ‌గా ఉన్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు ఒక లక్షమంది చనిపోగా.. ఇంకా చాలా మంది ఈ మహమ్మారికి బ‌లైన‌ట్టు తెలుస్తోంది. నిత్యం రోగుల‌కు వైద్యసేవలు అందించడంతోపాటు రోజులో ఎక్కువ టైమ్ ఆస్ప‌త్రుల్లోనే ఉండ‌టంతో వైద్యులకు ఈ రోగం వ‌స్తోంది.

దేశంలో రెండో వేవ్ వ్యాప్తి అధికంగా ఉన్న టైమ్‌లోనే మెడికల్‌ ఆక్సిజన్‌కు తీవ్ర కొర‌త ఏర్పడింది. ఈ కార‌ణంగానే ఆస్పత్రుల్లో ఎక్కువ సంఖ్యలో రోగులు చ‌నిపోయారు. అలాగే ఇంటెన్సివ్‌ కేర్‌లో చాలామంది రోగుల‌కు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. దీంతోనే డాక్టర్లకు, నర్సులకు కొవిడ్‌ సోకినట్లు ఎక్స్ ప‌ర్ట్స్ చెబుతున్నారు. ఎక్కువ పని గంటలు కూడా వైద్యులపై తీవ్ర మానసిక ఒత్తిడి చూపింద‌ని నిపుణులు వివ‌రిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: