నేడు తిరుమల పాలక మండలి సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇక ఈ సమావేశంలో చైర్మన్ సహా పాలకమండలి సభ్యులు అందరూ పాల్గొననూన్నారు. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈ సమావేశం జరగనుంది. అయితే ఎనభై అయిదు అంశాలతో కూడిన ఎజెండాను ఇక ఈ సమావేశంలో చర్చించేందుకు  అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది


 ప్రధానంగా గరుడ వారధి ని అలిపిరి రోడ్డు వరకు విస్తరణ చేపట్టాలని టిటిడి బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనికి నిధుల కేటాయింపుపై కూడా పాలక మండలి నిర్ణయం తీసుకొనుందట. అంతేకాదు టిటిడి ప్రతిష్టాత్మకంగా  అందిస్తున్న కల్యాణమస్తు కార్యక్రమం పై కూడా చర్చించనున్నారు. ఇక తిరుమలలోని ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీలలో 500 ఆలయాల నిర్మాణాలు చేపట్టేందుకు ఈ పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు . ఇక మరోవైపు హౌసింగ్ సొసైటీ నిబంధనల ప్రకారం తిరుమల ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపు గురించి కూడా ఈ సమావేశం లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.



 అయితే టిటిడి బోర్డు హిందూ ఆలయాలకు  ఇస్తున్న విగ్రహ సబ్సిడీ మూడు లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. ఉచితంగా ఆహారం, హాస్టల్ సదుపాయం కూడా కల్పించాలని అనుకుంటున్నారట. ఇక ప్రస్తుతం శ్రీవారి సన్నిధిలో పనిచేస్తున్న 2145 మంది ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని.. గతంలో ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన వెనక్కి తీసుకొనూన్నారట  ఇక 25 ఏళ్లపాటు సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఎన్టీపీసీ ఒప్పందం పై కూడా చర్చించనున్నారట.



 మొదటి ఘాట్ రోడ్డులోని 57వ మలుపు మంచి అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం సేఫ్టీ మెష్ ఏర్పాటు చేయనున్నారట. 2.9 కోట్ల నిధులతో వకుళమాత ఆలయం వద్ద ప్రహరీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తిరుమల మినహా టిడిపి పరిధిలోని అన్ని ఆలయాలకు విష్ణుభట్లచార్యులను  వైఖానస ఆగమ అడ్వైజర్ గా నియమించనున్నారట. గతంలో శ్రీవారి ఆలయంలో చనిపోయిన అర్చకులు స్థానంలో కొత్త వాళ్ళని నియమించనున్నారట. అంతేకాదు పలువురు అర్చకులను రెగ్యులరైజ్ చేయాలనుకుంటున్నారట. అటూ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు 16 కోట్లతో 1389 సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు టిటిడి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భక్తుల దర్శన సంఖ్యను పెంచడంపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd