ఇటీవలి కాలంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక ఆయా జిల్లాలలో కొన్ని అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కర్నూలు జిల్లా బద్వేలులో పర్యటిస్తున్నారు సీఎం జగన్. ఇక ఈ సమయంలోనే బద్వేల్ ని ఎంతో అభివృద్ధి చేస్తాం అంటూ హామీ ఇచ్చారు. అయితే ఇక జగన్ బద్వేలు పర్యటనలో భాగంగా ఒక అద్భుతమైన గడ్డం ఆవిష్కారం కానుంది అన్నది తెలుస్తుంది. ఏకంగా తాత స్టేడియంలో మనవడు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
 బద్వేలులో సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి పేరుమీద ఒక స్టేడియం ఉంది. ఇక ఇటీవల ఈ స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్టేడియంలో రంజీ మ్యాచ్ లు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక రానున్న రోజుల్లో డే అండ్ నైట్ మ్యాచ్ లను కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని స్టేడియం లో ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేయాలి అంటూ ఇటీవలే బీసీసీఐ తెలిపింది. దీంతో వేగంగా రాజారెడ్డి స్టేడియంలో ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేయడంతోపాటు ఇంకెన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు సీఎం జగన్ సిద్దమయ్యాడు.



 ఈ క్రమంలోనే ఇక రాజా రెడ్డి స్టేడియం స్టేడియంలో నాలుగు కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇక మనవడు వైయస్ రాజశేఖర్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఈ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు వైసీపీ శ్రేణులు అందరూ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007లో  50 లక్షలతో బద్వేలులో తన తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరుతో క్రికెట్ స్టేడియం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఈ స్టేడియం 2010లో పూర్తయింది. ఈ క్రమంలోనే ఇటీవల సీఎం జగన్ ఇక రాజారెడ్డి స్టేడియంలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలో పచ్చిక మైదానం లో వెల్కమ్ జగన్మోహన్రెడ్డి అంటూ అట్టహాసంగా స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు స్టేడియం నిర్వాహకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: