వానొస్తే హైద్రాబాదీకి మెట్రో గుర్తుకువ‌స్తుంది. మామూలు రోజుల్లో హైద్రాబాదీకి అస్స‌లు మెట్రో గుర్తుకు రావ‌డం లేదు ఇదీ ఓ సెటైర్.



ఆర్థికంగా క‌ష్టాలొస్తే
ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం
అటుగా చూడ‌దు?
చూడాల‌ని అనుకోదు
ఓ లాస్ వెంచ‌ర్ ను ఎల్ అండ్ టీ
ఎంత కాలం భ‌రిస్తుంది?


 

కిరోసిన్ తో న‌డిచిన సెట్విన్ బ‌స్సులకు ఉన్నంత ఆద‌ర‌ణ ఓ మెట్రోకు ఉండ‌దు అన్న‌ది తేలిపోయింది. కిరోసిన్ బండే మ‌న‌కు ప్రా ణాధారం అయింది. సేఫ్టీకి, సెక్యూరిటీ అదే కేరాఫ్ అయింది. అంతేనా! అంత‌కుమించి ఏమ‌యినా ఉందా? ఒక విధంగా చెప్పాలంటే మెట్రో లైఫ్ కు, మెట్రో జ‌ర్నీకి హైద్రాబాద్ ఇంకా సిద్ధం కాలేద‌నే అనాలి. అందుకేనేమో మెట్రోకి న‌ష్టాలు కోట్ల‌లో ఉంటోంది. ఈ ఏడా దికి వెయ్యి కోట్ల న‌ష్టం.  కానీ సేవ‌లందించాలి. కానీ వేళ‌కు న‌డ‌వాలి. ఇవ‌న్నీ ఓకే కానీ ప్ర‌భుత్వాలు మాత్రం ప్ర‌క‌ట‌న‌లో హైద్రాబాద్ మెట్రో రాక త‌మ గొప్పే అని చెబుతాయి. వేళ‌కు సాయం చేయ‌డంటే మాత్రం ముఖం చాటేస్తాయి. ఓ విధంగా తెలంగాణకు ఒక ఐక‌న్ - మెట్రో. ర‌ద్దీగా ఉండే ర‌హ‌దారుల నుంచి, ట్రాఫిక్ క‌ష్టాల నుంచి ఒడ్డెక్కించి ప్ర‌యాణికుల‌కు పొల్యూష‌న్ ఫ్రీ ప్రయాణం అందిం చ‌డంలో మెట్రో టాప్ రేంజ్ స‌ర్వీసులు అందిస్తోంది. హైద్రాబాద్ కు ప్రైడ్ మెట్రో అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహాల కు తావు లే దు. ఎన్నో ఆటుపోట్లు దాటుకుని ప్ర‌యాణించిన మెట్రో ఇక‌పై ఆగిపోనుందా లేదా ఆస్తులు అమ్ముకుని ఇదివ‌రక‌టిలా త‌న దారి తాను చూసుకుంటుందా?  

ఐదు వేల కోట్ల రుణం వ‌స్తే మెట్రో న‌డ‌క సాఫీ అవుతుంది. త‌క్కువ‌లో త‌క్కువ కావాల్సింది ఇది. కానీ ప్ర‌భుత్వంకు ఇది ప‌ట్ట‌దు.రుణం చిక్కక లేదా ద‌క్క‌క మైట్రో ని న‌డిపే ఎల్ అండ్ టీ కంపెనీ త‌న వాటాల‌నో, లేదా ఆస్తుల‌నో అమ్ముకోవాల‌ని చూస్తోంది. వా స్త‌వానికి ఇంత పెద్ద ప్రాజెక్టులోనూ ప్ర‌భుత్వం వాటా ప‌ది శాత‌మే. అయినా ప్ర‌భుత్వం నుంచి ఆర్థిక సాయం వ‌చ్చేది లేదు చచ్చేది లేదు. ఇప్పుడే కాదు ఎప్పుడూ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల్లో కేసీఆర్ త‌న ఘ‌న‌త అని చెప్పుకుంటారు. ఆప‌దొస్తే మాత్రం ఆదుకోరు. క‌రో నా కార‌ణంగా న‌ష్టాల బాట‌లో ఉన్న ఎల్ అండ్ టీ ఇక ఈ ప్రాజెక్టును వ‌దిలించుకోవ‌డమే బెట‌ర్ అని భావిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: