ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీకి అసలు తిరుగులేదనే సంగతి తెలిసిందే. ఆ పార్టీకి జనం మద్ధతుగా ఫుల్‌గా ఉందని ఇటీవల వెలువడిన ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ వన్‌సైడ్‌గా విజయాలు సాధించింది. ఈ స్థాయిలో విజయం సాధించిన కూడా వైసీపీ నేతల మధ్య సమన్వయం లేక ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. పదవుల కోసం కుమ్ములాటకు దిగుతున్నారు.

ఇప్పటికే కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై అసంతృప్తితో వైసీపీ ఎంపీటీసీ రామలక్ష్మమ్మ రాజీనామా చేశారు. ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మోసం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. అటు శృంగవరపుకోట ఎమ్మెల్యేపై కొత్తవలస మండల ఎం‌పి‌టి‌సిలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయనకు 14 మంది ఎం‌పి‌టి‌సిలు అందుబాటులో లేరని తెలిసింది. ఇక కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఎంపీపీ పదవిపై హామీ ఇచ్చి మాట మార్చారని గూడూరు మండలం, కె.నాగరాపురంలో ఎంపీటీసీ రాజమ్మ ఫైర్ అవుతున్నారు. ఎంపీపీ పదవి ఇస్తానని మోసం చేశారని ధర్నాకు దిగారు.

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజవర్గాల్లో వైసీపీ నేతల మధ్య రచ్చ నడుస్తోంది. అటు దర్శి నియోజకవర్గంలో ఇదే తరహా రాజకీయం నడుస్తోంది. పదవుల కోసం గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాల మధ్య రచ్చ తీవ్ర స్థాయికి చేరింది. ఎంపీ పదవుల కోసం ఇరు వర్గాలు పోటీ పడుతున్నాయి.

ఇక వీరి రచ్చ సి‌ఎం జగన్ వరకు వెళ్ళినట్లు తెలిసింది. ఇరు వర్గాల నాయకులకు జగన్ క్లాస్ పీకారని తెలిసింది. ఇద్దరు నాయకులు అభ్యర్ధుల పేర్లని ఇస్తే...పార్టీ ఒకరికి ప్రాధాన్యత ఇస్తుందని, ఇక పార్టీ లైన్ దాటకూడదని వారికి సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికి గెలిచినా సరే ఇలా వైసీపీ నాయకులు పదవుల కోసం కుమ్మలాడుకుంటూ పార్టీ పరువురు తీస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: