ఈ క్రమంలోనే అంతకు ముందు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు టీటీడీ బోర్డు సిబ్బంది. అయితే ముఖ్యమంత్రి జగన్ తిరుమల చేరుకుని కాసేపటికి ముందు ఊహించని ఘటన చోటు చేసుకోవడం తో ఒక్కసారిగా సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు. సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చే కొన్ని నిమిషాల ముందు.. శ్రీవారి ఆలయం ముందు ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న ఎల్జిబి బల్బులు అందరినీ భయాందోళనకు గురి చేసాయి. ఆలయం పై భాగం లో అలంకరణ ఉండగా ఆ అలంకరణలో నుంచి భారీగా మంటలు బయటపడ్డాయి.
దీంతో అక్కడున్న భక్తులందరికీ కాసేపటి వరకు ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. అక్కడ ఉన్న వారందరూ హడలిపోయారు అని చెప్పాలి. ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని అక్కడి నుంచి దూరంగా పరుగులు తీసారు. అయితే సీఎం పర్యటనకు ముందు ఇలా జరగడంతో సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు ఈ క్రమంలోనే ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని అక్కడి నుంచి దూరంగా పరుగులు పెట్టారు ఇక వెంటనే అటు విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక అక్కడికి చేరుకునే సరికే మంటలు ఆరిపోవడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి